Mamta Mohandas: రాజమౌళి అలా అనడంతో గుండె పగిలినంత పనైంది.. మమతామోహన్ దాస్ ఆసక్తికర కామెంట్స్
మమతామోహన్ దాస్ నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు. నేపధ్యగాయినిగా అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు మమతామోహన్ దాస్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మమతామోహన్ దాస్ నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు. నేపధ్యగాయినిగా అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించారు. తెలుగులో మమతామోహన్ దాస్ చేసిన సినిమాలు మూడు మాత్రమే. అయితే 2010 లో మమత క్యాన్సర్ బారినపడింది. 2010 నుండి హాడ్కిన్స్ లింఫోమాతో పోరాడింది. ఆ తర్వాత 2013 ఏప్రిల్‌లో, క్యాన్సర్ జబ్బు తిరగబెట్టింది. తిరిగి వైద్యం చేయించుకుని క్యాన్సర్ ను జయించింది మమత. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
యమదొంగ సినిమా కంటే ముందు తనకు అరుంధతి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని..అయితే ఆ నిర్మాణ సంస్థ పెద్దగా పేరున్నది కాదు అని తన మేనేజర్ చెప్పడంతో ఈ సినిమాలో నటించడానికి సంకోచించాను. అయితే అప్పట్లో నాకు తెలుగు సినీ పరిశ్రమ గురించి పెద్దగా తెలియదు అందుకే అరుంధతి సినిమా చేయడానికి వెనకాడను అన్నారు.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో చేశాను. ఆ మూవీ సమయంలో రాజమౌళి గారు నాతో మాట్లాడుతూ అరుంధతి సినిమా వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు అని అన్నారు. ఆయన ఆ మాట అనడంతో నాకు గుండె పగిలేనంత పని అయింది. అప్పటికీ ఆ సినిమా రిలీజ్ కాలేదు అని తెలిపింది.