AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: ఆ దర్శకుడు నాపై చెయ్యి చేసుకున్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఈ సినిమాలో నటించిన మమిత బైజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమా చూసిన వారు. చక్కటి నటనతో ఆకట్టుందని అంటున్నారు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఓ దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పేరున్న దర్శకుడు తాను తిట్టాడని అంటే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడని తెలిపింది. మమిత బైజు  చెప్పిన దర్శకుడు ఎవరో తెలుసా..

Mamitha Baiju: ఆ దర్శకుడు నాపై చెయ్యి చేసుకున్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Mamitha Baiju
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2024 | 6:48 PM

Share

మలయాళం నుంచి చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో ప్రేమలు ఒకటి. ఈ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాంతో ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమా చూసిన వారు. చక్కటి నటనతో ఆకట్టుందని అంటున్నారు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఓ దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పేరున్న దర్శకుడు తాను తిట్టాడని అంతే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడని తెలిపింది. ఇంతకు మమిత బైజు  చెప్పిన దర్శకుడు ఎవరో తెలుసా..

మలయాళం బ్యూటీ మమిత బైజు చెప్పిన దర్శకుడు మరెవరో కాదు తమిళ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాల. మమిత బైజు ప్రేమలు సినిమా కంటే ముందు వణంగాన్‌ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా షూటింగ్ నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆ  సినిమా సమయంలో దర్శకుడు బాల తనను తిట్టాడని అంతటి ఆగకుండా కొట్టాడని ఆమె తెలిపింది. తాజాగా మమిత ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాలను బయట పెట్టింది.

వణంగాన్‌ సినిమా షూటింగ్ లో నేను ఓ సంగీత పరికరాన్ని వాయించే సన్నివేశం చేయాలని చెప్పారు. అయితే నేను అనుభవం కళాకారిణిగా నటించాలా.? లేదా మొదటిసారి నేర్చుకుంటున్న అమ్మాయిగా నటించాలా.? అని దర్శకుడిని అడిగాను. దానికి ఆయన నువ్వు అనుభవం ఉన్న కళాకారిణిగా నటించాలని చెప్పారు. డ్రమ్స్‌ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిలా పాట పాడాలి అని నేను అనుకున్నా.. ఇంతలో కట్ చెప్పి వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా పాడాలని చెప్పారు. దాంతో నేను షాక్ అయ్యా.. వాళ్ళు ఏం పడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.. దాంతో ఎక్కువ టెక్స్ తీసుకున్నా.. అప్పటికే ఆయన నన్ను తిడుతున్నాడు. సెట్ లో నేను కోపంగా మాట్లాడుతా పట్టించుకోకండి అని ఆయన ముందే చెప్పారు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన నన్ను కొట్టాడు. అయితే ఇదంతా సూర్య సార్ కు తెలుసు.. వాళ్లిద్దరూ చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు అని తెలిపింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసింది. ఆ తర్వాత సూర్య కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. బాల వేరే హీరోతో ఆ సినిమాను పూర్తి చేశాడు.

మమిత బైజు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్