AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! ఇదేం ట్విస్ట్ రా బాబు.. ప్రేమ కథ చిత్రం హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.!

2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ నందిత తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి.

అమ్మబాబోయ్..! ఇదేం ట్విస్ట్ రా బాబు.. ప్రేమ కథ చిత్రం హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.!
Prema Katha Chitram
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2024 | 7:39 PM

Share

సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. 2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ నందిత తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు నందిత. నిజానికి తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వచ్చిన ప్రేమ కథ చిత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాలు చేసింది. మరోసారి సుధీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొన్నామధ్య ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత మళ్లీ కనిపించలేదు ఈ అమ్మడు. అయితే ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.

సందిత 2019లో విశ్వమిత్ర అనే సినిమాలో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యాక్టివ్ గా ఉండదు. దాంతో ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ కోసం నెటిజన్స్ కాస్త గట్టిగానే గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కెయండి.

Nanditha

నందిత రాజ్ లేటెస్ట్ ఫొటోస్ 

Nanditha. 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.