AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమిత బైజు అసలు పేరు ఏంటో తెలుసా.? ఎందుకు మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ఒకరు. ‘ప్రేమలు’ సినిమాతో కుర్రకారుకు ఫేవరెట్‌గా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

Rajeev Rayala
|

Updated on: Nov 03, 2026 | 11:29 PM

Share
సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ఒకరు. ‘ప్రేమలు’ సినిమాతో కుర్రకారుకు ఫేవరెట్‌గా మారిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మమిత.. తాజాగా తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను బయటపెట్టింది. అసలు తన పేరు మమిత కాదని, చిన్నప్పుడే జరిగిన ఓ పొరపాటు కారణంగా పేరు మారిపోయిందని వెల్లడించింది.

1 / 5
సాధారణంగా పిల్లలకు పేరు పెట్టే విషయంలో తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. తమకు నచ్చిన పేరును ఎంతో ఇష్టంగా ఎంపిక చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. మమిత బైజు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆమెకు తల్లిదండ్రులు మొదట పెట్టాలనుకున్న పేరు నమిత. అయితే జనన ధ్రువీకరణ పత్రంలో జరిగిన ఓ చిన్న తప్పిదం కారణంగా ఆ పేరు కాస్తా మమితగా మారిపోయింది. ఈ విషయాన్ని మమిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

2 / 5
పుట్టిన సమయంలో తన తల్లిదండ్రులు నమిత అనే పేరును నిర్ణయించారని, అయితే బర్త్ సర్టిఫికెట్‌లో పేరు నమోదు చేసే సమయంలో మొదటి అక్షరం మారిపోవడంతో మమితగా నమోదైందని తెలిపింది. ఈ పొరపాటును కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించలేకపోయారట. తనకు నాలుగైదేళ్ల వయసు వచ్చే వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలియలేదని మమిత చెప్పింది. స్కూల్‌లో చేర్పించే సమయంలో సర్టిఫికెట్‌లో ఉన్న పేరు చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట.

3 / 5
అప్పటికే అధికారిక పత్రాల్లో మమిత అనే పేరు ఉండటంతో అదే పేరును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలా నమితగా ఉండాల్సిన తన పేరు మమితగా మారిపోయిందని ఈ ముద్దుగుమ్మ వివరించింది. మమిత బైజు కెరీర్ విషయానికి వస్తే.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మలయాళ భామకు 'ప్రేమలు' సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో రీను పాత్రలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విడుదలైన తర్వాత ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.

4 / 5
ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన మార్కెట్‌ను విస్తరించుకుంది. ఇటీవల సూర్యతో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', నివిన్ పౌలీతో కలిసి నటించిన 'బెత్లెహోమ్ కుటుంబం' చిత్రాలతో మమిత ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు తమిళంలోనూ తన సత్తా చాటుతోంది. విష్ణు విశాల్‌తో కలిసి నటించిన 'ఇరందు వానమ్'తో పాటు 'PRS 01' వంటి ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే సంగీత్ ప్రతాప్‌తో కలిసి నటిస్తున్న 'హలో డియర్' 2027 జనవరి 29న విడుదల కానుంది. దీంతో రాబోయే రోజుల్లో మమిత మరిన్ని ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

5 / 5
Follow Us