దీపావళికి ముందు బంగారం ధరల్లో మార్పులు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతుందంటే
Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో నవంబర్ 4న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650కు, 22 క్యారెట్ల ధర రూ.1,28,010కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,99,900గా నమోదైంది.

బులియన్ మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళికి ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. కొన్ని రోజుల క్రితం లక్షా 50 వేల వరకు ఉన్న పది గ్రాముల ధర.. ప్రస్తుతం లక్షా 39వేలుగా ఉంది.. వాస్తవానికి.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణలు ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి.. ఈ క్రమంలోనే.. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి.. అయితే.. ఇటీవల తగ్గిన ధరలు.. మంగళవారం పెరిగాయి.. బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం నవంబర్ 4 ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర పెరిగి.. రూ.1,39,650 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 మేర పెరిగి.. రూ.1,28,010 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.1,99,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,39,650, 22 క్యారెట్ల ధర రూ.1,28,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,650 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,39,800, 22 క్యారెట్ల ధర రూ.1,28,160 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,650, 22 క్యారెట్ల ధర రూ.1,28,010 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,650, 22 క్యారెట్ల ధర రూ.1,28,010 ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,39,650, 22 క్యారెట్ల ధర రూ.1,28,010 ఉంది. వెండి కిలో ధర రూ.1,99,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
