AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI నాయిస్ కేన్సిలేషన్​ సహా మరెన్నో అదిరే ఫీచర్లతో Oppo Enco X4.. ప్రత్యేకతలు ఇవే

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఆడియో గాడ్జెట్లకు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, గేమింగ్ చేయడం, ఆన్‌లైన్ కాల్స్ మాట్లాడటం కోసం చాలామంది వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ Oppo తన ప్రీమియం ఆడియో విభాగంలో Enco X4 ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అధునాతన ఆడియో టెక్నాలజీ, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

AI నాయిస్ కేన్సిలేషన్​ సహా మరెన్నో అదిరే ఫీచర్లతో Oppo Enco X4.. ప్రత్యేకతలు ఇవే
Oppo Enco X4
Nikhil
|

Updated on: Nov 04, 2026 | 6:30 AM

Share

మ్యూజిక్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన Enco X4 ఇయర్‌బడ్స్‌లో Dynaudio ట్యూనింగ్, డ్యూయల్ డ్రైవర్ సెటప్, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఛార్జింగ్ కేస్‌తో కలిపి 53 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. మరి Oppo Enco X4లో ఉన్న పూర్తి ఫీచర్లు, ఆడియో పనితీరు, ఇతర ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

డ్యూయల్ డ్రైవర్ సౌండ్!

Oppo Enco X4 ఇయర్‌బడ్స్ డిజైన్ చాలా ఆధునికంగా, ప్రీమియంగా ఉంటుంది. వీటి ఛార్జింగ్ కేస్ కాంపాక్ట్ సైజ్‌తో గుండ్రని అంచులను కలిగి ఉంటుంది. Glacier White, Aura Violet కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్స్ బరువు 5.6 గ్రాములు మాత్రమే. దీనివల్ల ఎక్కువసేపు ఉపయోగించినా సౌకర్యంగా ఉంటాయి. వీటికి IP55 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. కాబట్టి వ్యాయామం చేసే సమయంలో చెమట, తేలికపాటి నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది.

సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే Dynaudio సహకారంతో వీటిని ట్యూన్ చేశారు. ఇందులో 11mm వూఫర్, 6mm ట్వీటర్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్ ఉంది. దీనివల్ల బాస్‌తో పాటు పాటల్లోని ఇతర శబ్దాలను కూడా స్పష్టంగా వినవచ్చని కంపెనీ పేర్కొంటోంది. AAC, SBC, LHDC, LC3 ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. Oppo Find X సిరీస్ ఫోన్లతో ఉపయోగించినప్పుడు మెరుగైన లాస్‌లెస్ ఆడియో అనుభవం లభించే అవకాశం ఉంది.

53 గంటల బ్యాటరీ!

ఈ ఇయర్‌బడ్స్‌లో AI రియల్ టైమ్ అడాప్టివ్ ANC టెక్నాలజీని అందించారు. ఇది పరిసరాల్లోని శబ్దాలను గుర్తించి, వాటికి అనుగుణంగా నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని సర్దుబాటు చేస్తుంది. Conversation Awareness ఫీచర్ ద్వారా ఎవరైనా మాట్లాడటం ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా ఆడియో వాల్యూమ్ తగ్గి ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌లోకి మారుతుంది. దీంతో ఇయర్‌బడ్స్ తీయకుండానే ఎదుటివారితో మాట్లాడవచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి 53 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 13 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో అదనపు ప్లేబ్యాక్ పొందే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్‌తో పాటు ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే మల్టీ-డివైస్ సపోర్ట్ అందించారు. మొత్తంగా ప్రీమియం డిజైన్, డ్యూయల్ డ్రైవర్లు, అడాప్టివ్ ANC, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి Oppo Enco X4 ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

Follow Us