Tollywood : సౌత్‌లో హీరోయిన్లలో ఆ భాగాన్ని జూమ్ చేసి మరీ చూపిస్తారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ సినిమాలతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు తెలుగులో ఓ స్టార్ హీరోతో కలిసి భారీ బడ్జెట్ మూవీలో నటిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

ఇప్పుడిప్పుడే దక్షిణాది సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుంటుంది. మలయాళీ సినిమాలతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నెమ్మదిగా తమిళంలో అవకాశాలు అందుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో ఓ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్రలు, వారి శరీర భాగాల ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్ నాభి, నడుము వంటి శరీర భాగాలను జూమ్ చేసి చూపిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట సంచలంగా మారాయి.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు. టాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ముంబై పెరిగాను. కానీ నాకు సౌత్ సినిమాల్లో ఉన్న సంస్కృతి కొత్తగా అనిపించింది. హీరోయిన్స్ ఫోటోస్ జూమ్ చేసి.. ముఖ్యంగా నడుము, నాభిని ఎక్కువగా చూస్తారు. ఇక సినిమాల్లో కెమెరాస్ సైతం నాభిని ఎక్కువగా జూమ్ చేసి చూపిస్తాయి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు మాళవిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమె తీరుపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో నటిస్తూ సౌత్ మూవీస్, సంస్కృతిని విమర్శించడం సరైన పద్దతి కాదంటూ కొందరు నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు.
మాళవిక సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్. కేరళలోని పయ్యనూర్ లో జన్మించిన ఈ అమ్మడు ముంబైలో పెరిగింది. 2013లో మలయాళీ చిత్రం పట్టం పోల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో ఆఫర్స్ అందుకుంది. పెట్ట, మాస్టర్, తంగలాన్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.
ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాజా సాబ్ మూవీలో నటిస్తుంది మాళవిక. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీలో రిద్ది కుమార్, నిధి అగర్వాల్ సైతం నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తుంది మాళవిక.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
