AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది.. అందుకే సావిత్రి చివరి చూపుకు వెళ్ళలేదు

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కృష్ణకుమారి. దశాబ్దాలపాటు సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చీరకట్టులో పోతపోసిన బొమ్మలా కనిపించిన ఆమె, తన అందం, అమాయకత్వం, అభినయంతో ఆ తరం తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆ తప్పు చేసింది.. అందుకే సావిత్రి చివరి చూపుకు వెళ్ళలేదు
Savitri
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2026 | 10:25 AM

Share

తెలుగు వెండితెరను ఒకప్పుడు ఏలిన స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో దివంగత అగ్రనటి కృష్ణకుమారి ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలో నటించి తెలుగు సినిమాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. చీరకట్టుతోనే పోత పోసిన బొమ్మలా, అందం, అమాయకత్వం, అభినయం కలగలిసిన నటిమణిగా ఆమె తెలుగువారందరినీ ఎంతగానో అలరించారు కృష్ణకుమారి. అగ్ర నటీమణులు స్థిరపడిన రోజుల్లో కూడా తనదైన శైలిని సృష్టించి, కొన్ని క్యారెక్టర్ రోల్స్ సహా అన్ని రకాల పాత్రలను పోషించారు. వివాహం తర్వాత నటనకు దూరమైనా, ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులకు ఎప్పుడూ దూరం కాలేదనే చెప్పాలి.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు

కృష్ణకుమారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించారు. హిందీలో ఒక చిత్రంలో నటించిన తర్వాత నాలుగు చిత్రాలకు అవకాశాలు వచ్చినా, విమాన ప్రయాణం పట్ల ఉన్న భయం, అలాగే తనకు నచ్చిన తెలుగు భాషలోనే స్వేచ్ఛగా నటించగలననే భావనతో వాటిని నిరాకరించారు. తమిళంలో నటించినప్పటికీ, అక్కడి వాతావరణానికి అంతగా కనెక్ట్ కాలేకపోయానని, అందుకే తెలుగుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. నాటి దిగ్గజ నటి సావిత్రితో తన అనుబంధం గురించి గతంలో కృష్ణకుమారి మాట్లాడుతూ, ఆవిడ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని, ఇద్దరూ అక్కాచెల్లెళ్ళలాగా కలిసిపోయేవారని తెలిపారు.

ఇది కూడా చదవండి : శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

వారిద్దరి మధ్య ఎప్పుడూ పోటీతత్వం లేదని, సావిత్రి గొప్ప నటి అని, ఆమె పాత్రలు ఆమెకు, తన పాత్రలు తనకు బాగా సరిపోతాయని స్పష్టం చేశారు. అయితే, మహానటి సావిత్రి జీవిత పతనంపై కృష్ణకుమారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. సావిత్రి జీవితం చివరి దశలో పూర్తిగా మారిపోయిన తీరు పట్ల చాలా బాధపడ్డానని, తనకైతే తీవ్రమైన కోపం వచ్చిందని పేర్కొన్నారు. “ఇంతటి గొప్ప కళాకారిణి, మహానటి జీవితం ఎందుకు అలా కావాల్సి వచ్చింది.? ఆమె తెలివితేటలు ఏమయ్యాయి.?” అని అనిపించింది. ఆమె చేసిన ఆ తప్పు వల్లే సావిత్రి చివరి చూపుకు వెళ్లలేదని  వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, సమస్యలు అందరికీ సాధారణమే అని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే అలాంటి పరిస్థితుల వల్ల తమను తాము దిగజార్చుకోకూడదని, కష్టాల సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవలసిన బాధ్యత ఉందని ఆమె అన్నారు. సహనటుల గురించి ప్రస్తావిస్తూ, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సరదాగా ఉండేవారని, సెట్స్‌లో జోకులు వేస్తూ అందరినీ ఫ్రీగా ఉంచేవారని, తప్పులు జరిగితే సరిచేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండేవారని, కానీ షాట్ విషయంలో చాలా కరెక్ట్‌గా ఉండేవారని, అది ఆయన స్వభావమే అని తర్వాత అర్థమైందని చెప్పారు. కాంతారావుతో 28 సినిమాలు, అందులో విఠలాచార్య గారి దర్శకత్వంలో 15 సినిమాలు, అలాగే జగ్గయ్య గారితో పలు చిత్రాల్లో నటించానని తెలిపారు. అప్పట్లో అందరూ మంచినటులే అని కొనియాడారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
కుక్కల కోసం బీర్.. దీని ప్రత్యేకత ఏంటి?
కుక్కల కోసం బీర్.. దీని ప్రత్యేకత ఏంటి?
మీరూ JEE మెయిన్ రాశారా..? ఆర్మీలో అధికారులుగా చేరే అవకాశం! లింక్
మీరూ JEE మెయిన్ రాశారా..? ఆర్మీలో అధికారులుగా చేరే అవకాశం! లింక్