అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు మరో సీనియర్ హీరోతో మీనాక్షి చౌదరి

25  September 2026

Basha Shek

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

ముఖ్యంగా గత రెండేళ్లుగా వరుసగా హిట్స్ అందుకుంటోంది మీనాక్షి.  హిట్-2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు సినిమాలతో మీనాక్షి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్య సరసన వృషకర్మ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడికి మరో ఛాన్స్ వచ్చిందని టాక్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 158వ చిత్రం 'కాకా' సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తోందని సమాచారం. కేఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే కాకా సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ రోల్ లో నటించడం లేదని, మరో కీలక మైన పాత్రలో నటించనుందని ఇండస్ట్రీ టాక్.

సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మీనాక్షి  పాత్ర రానుందని,  ఈ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది మీనాక్షి. ఇప్పటికే అక్షయ్ కుమార్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.

కాగా గతంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి మీనాక్షి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ తో జోడీ కట్టిందీ అందాల తార.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.