AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

Phani CH
|

Updated on: Sep 25, 2026 | 10:18 PM

Share

తిరుపతి రూరల్‌ పరిధిలోని అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో 60 గ్రాముల బంగారం చోరీకి గురైంది. గోల్డ్‌ లోన్‌ రెన్యువల్‌ కోసం వచ్చిన మహిళ కౌంటర్‌ వద్ద ఉండగా, ఓ వ్యక్తి అప్రైజర్‌ అజాగ్రత్తను గమనించి పేపర్‌తో అడ్డుగా పెట్టి బంగారం ఉన్న కవర్‌ను అపహరించాడు. కొద్దిసేపటికి చోరీ విషయం గుర్తించిన సిబ్బంది సీసీటీవీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బ్యాంకుకు పని ఉన్నట్లు వచ్చి, సిబ్బంది అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని క్షణాల్లో 60 గ్రాముల బంగారాన్ని కాజేసిన ఘటన తిరుపతి రూరల్ పరిధిలోని అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో చోటుచేసుకుంది. ఒక మహిళ తన గోల్డ్ లోన్ రెన్యువల్ చేయించుకోవడానికి కౌంటర్ వద్ద కూర్చుని ఉంది. ఇంతలో ఆ బ్యాంకులోకి ఓ వ్యక్తి వచ్చాడు. చుట్టూ పరిశీలించాడు. అప్రైజర్‌ కాస్త అజాగ్రత్తగా ఉండటాన్ని గమనించాడు. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు నటిస్తూ చేతిలో ఒక పేపర్ పట్టుకుని హడావుడి చేస్తూ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అడ్డుగా ఉన్న డోర్‌ను ముందుకు నెట్టి, తన చేతిలోని పేపర్‌ను అడ్డుగా పెట్టి తూకం వేసి కవర్‌లో ఉంచిన 60 గ్రాముల బంగారాన్ని అత్యంత తెలివిగా కొట్టేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు హడావుడిగా బ్యాంకు నుంచి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బంగారం ఉంచిన ప్యాకెట్ కనిపించకపోవడంతో కంగారుపడిన బ్యాంకు సిబ్బంది, చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఆ కేటుగాడి చేతివాటం మొత్తం రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంకు మేనేజర్ గిరీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు

చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..

‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!

Follow Us