AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను అలాంటి అమ్మాయిని కాను.. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. డ్రాగన్ బ్యూటీ ఎమోషనల్

కాయదు లోహర్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో సెటిల్ అయ్యింది కాయదు. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన కాయదు, 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది.

నేను అలాంటి అమ్మాయిని కాను.. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. డ్రాగన్ బ్యూటీ ఎమోషనల్
Kayadu Lohar
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2025 | 8:42 AM

Share

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాయదు లోహర్ మొనీమధ్య ఊహించని చిక్కుల్లో పడింది. కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఈ న్యూస్ కోలీవుడ్ లో తెగ వైరల్ అయ్యింది.

తాజాగా దీని పై కాయదు స్పందించింది. నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు తీసుకోవడం, మద్యం స్కామ్ తో సంబంధాల ఆరోపణలపై కాయదు లోహర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాగా కొద్దిరోజుల క్రితం.. కాయదు లోహర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో తెగ వైరల్ అయ్యాయి. తమిళనాడు రాష్ట్ర మద్యం సంస్థ (TASMAC) స్కామ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని వార్తలు వచ్చాయి. ED దాడుల సమయంలో కాయదు లోహర్ కు ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. అంతే కాదు ఈ బ్యూటీ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

తాజాగా కాయదు లోహర్ మాట్లాడుతూ.. ప్రజలు తన గురించి ఇలా మాట్లాడటం కష్టంగా ఉందని తెలిపింది. పుకార్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంది.. “ఇది అంత సులభం కాదు. నేను దీని గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. నేను అలాంటి నేపథ్యం నుంచి రాలేదు. ఇలాంటివి నాకు చాలా కొత్త. ప్రజలు నా గురించి మాట్లాడుతున్న ఏదైనా నన్ను ఇంతగా బాధపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నిద్ర పోదామంటే, ప్రజలు నా గురించి ఇలా అనుకుంటున్నారనే ఆలోచన నాకు నిద్ర రాకుండా చేస్తుంది. ఎందుకంటే నేను ప్రపంచంలో ఎవరి గురించి కూడా ఇలా అనుకోను అంటూ ఎమోష్నలైంది కాయదు. అలాగే నేను ఎప్పుడూ ప్రజలతో కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తా.. నేను నా కలలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నా.. నేను ఏమి తప్పు చేశానో నాకు తెలియదు. నేను ఈ కామెంట్లు చూసినప్పుడు, ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, చదవడం అంత సులభం కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే, నన్ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు.? నేను ప్రేమను పంచుతూనే ఉంటా. కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.