AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashish Khan: ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. హీరోయిన్ కశిష్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్

Kashish Khan: ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం..  హీరోయిన్ కశిష్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Kashish Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2021 | 7:58 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశిష్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు.

హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ” ఆడిషన్స్ కోసం నా మేనేజర్ సతీష్ ఇన్‏స్టాగ్రాంలో మెసెజ్ చేశారు. కానీ మొదట నమ్మలేదు. అలా మూడు నెలలు రిప్లై ఇవ్వలేదు. చివరకు రిప్లై ఇచ్చాక ఆడిషన్ చేశారు. సెలెక్ట్ అయ్యాను. ఇందులో మంచి పాత్రలో కనిపిస్తాను. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను. నాకు ఇదే మొదటి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. కానీ రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. అన్ని విషయాల్లో సాయం చేశారు. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది.

అలాగే.. నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు నిర్మాత సుప్రియ మేడంకు థ్యాంక్స్. ఆమె లేడీ బాస్. సెట్‌లో అందరినీ బాగా చూసుకునే వారు. ఎంతో సురక్షితంగా అనిపించింది. డైరెక్టర్ శ్రీనుకు ఏం కావాలో అది బాగా తెలుసు. ఆయనకు క్లియర్ విజన్ ఉంది. అందుకే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు. ఏం కావాలి.. ఎలా చేయాలని చెప్పేవారు. మేం చేసేవాళ్లం. సెట్ అంతా సందడి వాతావరణంగా ఉండేది. సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది. ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. నీ వల్లేరా అనే పాట నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రేక్షకులు ఆశించవచ్చు. షూటింగ్ కంటే రెండు వారాల ముందే నా డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేశాను. నా అసిస్టెండ్ డైరెక్టర్లు ఎంతో సాయం చేశారు. ఒక్కో పదాన్ని ఎలా పలుకుతారో తెలుసుకున్నాను. చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేశాను.

డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశాను. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు ప్రతీ పాత్రను పోషించాలని ఉంది. సింపుల్ నుంచి గ్రాండియర్ వంటి కారెక్టర్‌ను పోషించాలని ఉంది. యాక్టర్ అయితే ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో పాత్రలను పోషించవచ్చు. అందుకే నేను నటిగా మారాను. నా మొదటి సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంగా ఉంది.కానీ నర్వస్‌గా ఫీలవుతున్నాను. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎమోషనల్ సీన్స్ చేయడం నాకు చాలా కష్టంగా మారింది. అదే నాకు సవాల్ అనిపించింది. తెలుగు భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది. నాగార్జున గారు రూంలోకి ఎంట్రీ అయితే అందరూ ఆయన్ను చూస్తుంటారు. నేను ఆయన్ను చూసి ఆ! అంటూ ఆశ్చర్యపోయాను. ఆయన నా ముందున్నారు అనే ఫీలింగ్‌‌లో ఉండిపోయాను. ఈ సినిమా మొదటి నుంచి సుప్రియ మేడం మాతో ప్రయాణించారు. ఆమె ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు అంటూ తెలిపింది కశిష్ ఖాన్.. ఇక ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Bigg Boss 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారా..? రంగలోకి దిగనున్న శృతీ హాసన్‌.. కారణం ఏంటో తెలుసా.?

Pooja Hegde: ఎట్టకేలకు నా కల నెరవేరింది.. ఆసక్తికరమైన ఫోటోతో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే..