AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyani Priyadarshan: ఆ వీడియోతో ఫ్యాన్స్‏కు షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. సీరియల్ నటుడితో..

కళ్యాణి ప్రియదర్శన్ హలో సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఈ బ్యూటీ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో తెలుగులో కళ్యాణికి అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు.

Kalyani Priyadarshan: ఆ వీడియోతో ఫ్యాన్స్‏కు షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. సీరియల్ నటుడితో..
Kalyani Priyadarshan
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2024 | 8:36 AM

Share

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు కళ్యాణి ప్రియదర్శన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రలహరి, రణరంగం సినిమాలు కూడా అంతగా మెప్పించకపోవడంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది కళ్యాణ్. నటిగానే కాకుండా దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కుమార్తెగా అందరికీ సుపరిచితం ఈ బ్యూటీ. కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ తెలుగు, తమిళం, మలయళం ఇండస్ట్రీలో పలు చిత్రాలను తెరకెక్కించాడు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణి ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. కానీ తనదైన నటనతో మెప్పించిన ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పెళ్లి వీడియో షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది ఈ అమ్మడు.

ఆ వీడియోలో సీరియల్ నటుడు శ్రీరామ్‏ను పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో కళ్యాణి షేర్ చేసిన వీడియో చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. శ్రీరామ్ కస్తూరిమాన్ సీరియల్ ద్వారా తమిళ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. టీవీల్లో అనేక షోలు, సీరియల్స్ చేసిన శ్రీరామ్.. ఇప్పుడు కళ్యాణితో పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ‘అవును.. ఈ క్షణాలు మమ్మల్ని సంతోషపరుస్తాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారా అనే సందేహలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఆ వీడియో చూస్తుంటే వీరిద్దరి కలిసి కమర్షియల్ యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ వీడియోలో కళ్యాణి తల్లిదండ్రులు, సన్నిహితులు ఎవరూ కనిపించలేదు. దీంతో ఆ వీడియో కేవలం ప్రకటన మాత్రమే అనట్లు తెలుస్తోంది.

సీరియల్ నటుడు శ్రీరామ్ కు ఇదివరకే పెళ్లి జరిగింది. అతడికి కూతురు కూడా ఉంది. అతడి భార్య వందిత నృత్యకారణి. వీరిద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కళ్యాణితో పెళ్లి వీడియో వైరల్ కావడంతో అసలు విషయం చెప్పాడు శ్రీరామ్. తనకు, కళ్యాణికి పెళ్లి కాలేదని, ఇది తాము కలిసి నటించిన ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ చిత్రానికి సంబంధించిన వీడియో అని శ్రీరామ్‌ చెప్పడంతో అంతా ఉపశమనం పొందారు. భారత్ వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రకటనలో కల్యాణి, శ్రీరామ్ కలిసి నటించారు. కళ్యాణితో శ్రీరామ్ కనిపించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కళ్యాణి షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.