జ్యోతిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సూర్య సతీమణి జ్యోతిక కూడా సిని పరిశ్రమ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బాండింగ్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అయితే తమిళనాడులో జ్యోతిక గురించి ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తోందట. మరో రెండేళ్లలో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జ్యోతిక ఓ […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:49 am, Fri, 28 June 19
జ్యోతిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న ఇమేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సూర్య సతీమణి జ్యోతిక కూడా సిని పరిశ్రమ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బాండింగ్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అయితే తమిళనాడులో జ్యోతిక గురించి ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తోందట. మరో రెండేళ్లలో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జ్యోతిక ఓ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ పార్టీ ఏంటి.. ఎక్కడి నుంచి పోటీ చెయ్యొచ్చు అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.