Jayavani: నటి అశ్లీల ఫోటోలు వైరల్.. అది ఫేక్ అకౌంట్ అంటూ ఆవేదన
ముఖ్యంగా హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు నెట్టింట దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. అలాగే కొంతమందివి మార్ఫింగ్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక సోషల్ మీడియా వల్ల ఎంత క్రేజ్ వస్తుందో అంతే సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు నెట్టింట దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. అలాగే కొంతమందివి మార్ఫింగ్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. దాంతో సదరు హీరోయిన్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటి కూడా తన పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. జయవాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమె ను చూస్తే ఇట్టే గుర్తుపడతారు.
జయవాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ఈమె. ముఖ్యంగా రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు పై అటాక్ చేసే మహిళగా కనిపించింది. ఓరేయ్ సత్తిబాబు బయటకు రారా సచ్చినోడా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె నటించింది. యమదొంగ , గుంటూరు టాకీస్ , లవర్స్ ఇలా పలు సినిమాల్లో కనిపించింది జయవాణి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. కానీ ఆమెకు ఫేస్ బుక్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఆమె పేరుమీద ఎవరో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అశ్లీల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. అదితెలియక చాలా మంది ఆ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు. దాంతో జయవాణి అది ఫేక్ అకౌంట్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.