Savitri : ఆ రోజున సావిత్రి బాగా తాగేసి వచ్చింది.. జమున చెప్పిన ఆసక్తికర విషయాలు..
అప్పటి స్టార్ హీరోలకు పోటీగా నటించే వారు సావిత్రి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్స్ ప్రశంసలు అందుకున్నారు సావిత్రి. సావిత్రి డేట్స్ కూడా దొరికేవి కావట ఆసమయంలో..

అలనాటి అందాల తారల్లో ఇప్పటికి ఎప్పటికి చెప్పుకునే పేరు సావిత్రి. తెలుగు సినిమా చరిత్ర ఆమెను మహానటి అని కీర్తించింది. నటనలో ఆమెను తలదన్నేవారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. తనదైన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సావిత్రి. అప్పటి స్టార్ హీరోలకు పోటీగా నటించే వారు సావిత్రి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్స్ ప్రశంసలు అందుకున్నారు సావిత్రి. సావిత్రి డేట్స్ కూడా దొరికేవి కావట ఆసమయంలో.. వెండితెరపైన వెలిగిన సావిత్రి జీవితంలో చీకటి కూడా ఉంది. ఆమె చేసిన పలు తప్పులు ఆమెకు శాపంగా మారాయి. సినిమాలతోనే కాదు సేవా గుణంలోనూ సావిత్రిని తలదన్నే వారు లేదు . కష్టం వచ్చింది అన్నవారికి లేదనకుండా కాదనకుండా సాయం చేసేవారు సావిత్రి. జెమిని గణేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రి జీవితం మొత్తం తలకిందులు అయ్యింది. అదే సమయంలో ఆమె మద్యానికి బానిస అయ్యింది.
అయితే సావిత్రి గురించి అలనాటి నటి జామున చెప్పిన విషయాలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ లో జామున మాట్లాడుతూ.. సావిత్రి గురించి ఎమోషనల్ అయ్యారు. జామున సావిత్రి ఇద్దరు అక్క చెల్లెళ్లుగా ఉండేవారు. ఒకసారి సావిత్రి ఫుల్ గా తాగేసి వచ్చారని అన్నారు జామున.




ఆమె మాట్లాడుతూ.. మా అబ్బాయిని ఉయ్యాలలో వేసే రోజు సావిత్రిని ఇంటికి ఆహ్వానించా.. అప్పుడు సావిత్రి ఫుల్ గా తాగేసి ఉంది. మా అబ్బాయిని ఎత్తుకొని.. ఆడించింది. ఆ తర్వాత నన్ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బోరున ఏడ్చింది. నన్ను గట్టిగా కౌగలించుకుని పెద్దగా ఏడ్చేసింది. నువు చాలా అదృష్టవంతురాలివే..చెల్లి. మంచి భర్త.. కొడుకు నిండు సంసారం..చాలా సంతోషంగా ఉంది..నాకు ఈ అదృష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత నన్ను జెమినీ అలా చేశాడు..ఇలా చేశాడని అతడిగురించి చెప్పి ఏడ్చేసింది అన్నారు. అప్పుడు నేను తనకు దైర్యం చెప్పే ప్రయత్నం చేశా.. జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరు పిల్లలున్నారు నీకు ఎం కాదు అంటూ ఓదార్చా అని అన్నారు జామున.




