Keerthy Suresh: మేడ మీద ముద్దుగుమ్మ మతి చదరగొట్టే యోగాసనాలు.. చూసి తీరాల్సిందే
ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మలయాళ సినిమాలతో పాటు.. తమిళ్, తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది తక్కువ సమయంలోనే కీర్తిసురేష్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
టాలీవుడ్ కళావతిగా మారిపోయారు కీర్తిసురేష్. యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మలయాళ సినిమాలతో పాటు.. తమిళ్, తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది తక్కువ సమయంలోనే కీర్తిసురేష్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. అయితే కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇటీవలే మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటించింది. మొన్నటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి.. మహేష్ సినిమాలో రెచ్చిపోయింది. అందాలతో కట్టిపడేసింది.
ఇక సోషల్ మీడియాలోనూ కీర్తిసురేష్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు తన ఫొటోలతో పాటు సినిమాల అప్డేట్స్ కూడా ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కీర్తి. తాజాగా కీర్తి షేర్ చేసిన యోగా వీసియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేడపైన యోగాసనాలు వేస్తున్న వీడియో షేర్ చేసింది కీర్తి. ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం కీర్తి తమిళ్ సినిమాలతో పాటు తెలుగు దసరా అనే సినిమా చేస్తోంది నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమాలో కీర్తి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.