
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు సహాయక పాత్రలు చేస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు కొంతమంది హీరోయిన్స్.. వారిలో ఇంద్రజ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ ఇంద్రజ.. ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇంద్రజ.. పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు ఇంద్రజ.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు ఇంద్రజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ నటుల గురించి అడిగినప్పుడు..ఆమె సమాధానమిస్తూ.. నా గురించి ఏదైనా అడగండి, నేను చెప్తాను. ఇంకెవరి గురించి నేను మాట్లాడను. అని ఆమె అన్నారు.
జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడం గురించి మాట్లాడుతూ.. సుధీర్ లేకపోవడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్న అని అన్నారు.. సుధీర్‌తో తన బంధం ఎంత బలమైందని తెలిపారు ఇంద్రజ. జబర్దస్త్ షోలో సుధీర్ లేకుండా అతని టీమ్ స్కిట్ చేసినప్పుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయానని ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు.. సుధీర్‌ను తాను సిద్ధు అని ముద్దుగా పిలుస్తానని, ఈ అలవాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌కు సుధీర్ అక్కయ్యలు అతిథులుగా వచ్చినప్పుడు మొదలైందని తెలిపారు. ఇంట్లో సుధీర్‌ను సిద్ధు అని పిలుస్తారని వారు చెప్పిన తర్వాత, ఆమెకు ఆ పేరు అలవాటు అయ్యిందని, సుధీర్ కూడా కొన్నిసార్లు ఆమెను రాజి అని పిలుస్తారని తెలిపారు ఇంద్రజ.
సుధీర్ తో ఉన్న బంధం కేవలం కెమెరా కోసం కాదని, అది స్వచ్ఛమైన బంధమని ఇంద్రజ స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ, చాలా మంది తమను అమ్మ-కొడుకు లాంటి బంధంతో చేస్తుంటారని ఇంద్రజ అన్నారు. అమ్మ అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటది, గమ్మత్తుగా ఉంటది వినడానికి అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. అతన్ని దేవుడిచ్చిన కొడుకుగా భావిస్తున్నానని ఇంద్రజ తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.