
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే గేమ్ షోలు ప్రేక్షకులకు అందిస్తుంది ఆహా. అయితే కొన్నాళ్లుగా సింగింగ్ టాలెంట్ ఉండి నిరూపించుకునేందుకు సరికొత్త ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూస్తున్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో సింగింగ్ షో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించి పోస్టర్స్, ప్రోమోస్ రివీల్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ 4 ఎపిసోడ్ లో తాజాగా హాసినీగా తెలుగు ఆడియెన్స్ కు గుర్తుండిపోయిన హీరోయిన్ జెనీలియా అతిథిగా పాల్గొన్నారు. జెనీలియా అతిథిగా సందడి చేయడం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు ఒక హైలైట్ గా నిలుస్తోంది.
ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రసారమవుతోంది. ప్రేక్షుకులకు వినోదాన్ని పంచుతూనే ప్రతిభ ప్రోత్సహించేందుకు ఈ తరహా రియాలటీ షోలను ఆహా అందించడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.