Indrani Movie: ఇంద్రాని నుంచి మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్.. సైన్స్ ఫిక్షన్ ఫిమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రంగా..

తెలుగు, తమిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మొట్ట మొదటి సూపర్ గర్ల్ చిత్రం `ఇంద్రాని`.

Indrani Movie: ఇంద్రాని నుంచి మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్.. సైన్స్ ఫిక్షన్ ఫిమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రంగా..
Indrani
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 8:25 AM

యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహ‌న్‌ సింగ్, ష‌త‌ఫ్ అహ్మ‌ద్‌, గ‌రీమా కౌశ‌ల్‌, ఫ్ర‌నైట జిజిన ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఇంద్రాని (Indrani). తెలుగు, తమిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మొట్ట మొదటి సూపర్ గర్ల్ చిత్రం `ఇంద్రాని`. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి, మేకింగ్ వీడియోకి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఈ సినిమా నుంచి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌..ఈ సంద‌ర్భంగా ఫ్ర‌నైట‌ పాత్ర చాలా ముఖ్యమైనదని, ఇంద్రాణితో సమానంగా ఉంటుంది కాబట్టి అనేక రౌండ్ల ఆడిషన్స్ తర్వాత ఫ్రనైటా ఆ పాత్ర కోసం ఎంపిక చేయడం జ‌రిగింద‌ని మేకర్స్ పేర్కొన్నారు.

ద‌ర్శ‌కుడు, నిర్మాత స్టీఫెన్ మాట్లాడుతూ – ఇంద్రాణి సినిమా మూడు పాత్రల చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. నేను రూపొందించాలనుకుంటున్న సూపర్ గర్ల్ సిరీస్‌కి సరికొత్త రూపాన్ని ఇవ్వడానికి కొత్త టాలెంట్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాను. అందులో భాగంగానే కొత్త న‌టీన‌టుల‌ని ఎంపిక చేసుకోవ‌డం జ‌రిగింది. ఫ్రనైటా అద్భుతమైన నటి మ‌రియు అద్భుతమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. యానియా భరద్వాజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో లీడ్ లో ఉండ‌గా, ఫ్ర‌నైట జిజిన మరియు గరిమా కౌశల్ డ్యాన్స్ నంబర్స్‌లో లీడ్‌గా ఉంటారని మరియు సినిమాలోని అన్ని పాటలు సినిమాను పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మారుస్తాయని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ స్టాన్లీ సుమ‌న్ బాబు మాట్లాడుతూ – “మా విజ‌న్ ను న‌మ్మి అమెరికాలోని చికాగో నుండి సుధీర్ వేల్పుల గారు & కెకె రెడ్డి గారు మరియు యుఎస్ఎలోని వర్జీనియా నుండి జే జి.సేన్ గారు ఈ చిత్రానికి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి మా హృద‌య పూర్వ‌క‌ ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాను” అన్నారు. ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 27 అక్టోబ‌రు 2022న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇవి కూడా చదవండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు