AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య కూతురిగా ఆ యంగ్ హీరోయిన్ ?.. అనిల్ రావిపూడి సినిమాలో క్రేజీ బ్యూటీ..

బాలయ్యతో తాను చేయబోయే సినిమా డిఫరెంట్‏గా ఉండబోతుందని.. అందులో ఆయన భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని ఇదివరకే డైరెక్టర్ అనిల్ రావిపూడి

Balakrishna: బాలయ్య కూతురిగా ఆ యంగ్ హీరోయిన్ ?.. అనిల్ రావిపూడి సినిమాలో క్రేజీ బ్యూటీ..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: May 23, 2022 | 8:42 AM

Share

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి .. నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు.

బాలయ్యతో తాను చేయబోయే సినిమా డిఫరెంట్‏గా ఉండబోతుందని.. అందులో ఆయన భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని ఇదివరకే డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథాంశంగా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా బాలయ్య కూతురిగా పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారట. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీలను తీసుకోవడంతోపాటు.. వెండితెరపై ఈ సినిమాను సరికొత్తగా చూపించబోతున్నారట డైరెక్టర్. ప్రస్తుతం శ్రీలీల.. ధమాకా సినిమాలో నటిస్తుండగా..బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Follow Us
తల్లి కోసం బిడ్డల్లా.. ఈమె కోసం సొర చేపలు ఎదురుచూస్తాయి!
తల్లి కోసం బిడ్డల్లా.. ఈమె కోసం సొర చేపలు ఎదురుచూస్తాయి!
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
మిత్రుడి పార్దివదేహాన్ని చూడగానే చిరంజీవి ఎమోషనల్..
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
సెప్టెంబర్ లక్కీ రాశులు.. బాబోయ్ వీరి ఇంట ఇక డబ్బుల వర్షమే
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
1983 జీవితఖైదు, 2004లో బెస్ట్ టీచర్ అవార్డ్‌! అసలు ట్విస్ట్
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
మీరు మొదటిసారి హెలికాప్టర్‌లో ఎక్కితే ఈ తప్పులు అస్సలు చేయకండి
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అన్నదమ్ములుంటే అదృష్టమే..!
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
మీ ఫోన్ మాటిమాటికీ హ్యాంగ్ అవుతుందా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!
అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు.. కన్నీళ్లు తెప్పించే విషాదం!