తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ ఇమేజ్ వచ్చాకా మాత్రం అడియన్స్ ఆరాధించే దేవతగా మారింది. దీంతో అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుని.. అద్భుతమైన నటనతో మెప్పించింది. పాత్రకు వెయిట్ ఉంటే చిన్న హీరోలతో సైతం నటించేందుకు రెడీ అయ్యింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది.
ఇటీవలే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఓ స్టార్ హీరో సినిమాలో అనుష్కకు మంచి ఆఫర్ వచ్చిందట. ఆ సినిమా కోసం ఆమెకు రూ.5 కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పారట. కానీ ఆ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకరించలేదట. ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అని సమాచారం. అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయిన అనుష్క.. వచ్చిన ఆ ఆఫర్ సైతం నటనకు ప్రాధాన్యత ఉండాలని రిజెక్ట్ చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం అనుష్క ఘాటీ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క మాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన