Anupama Parameswaran: స్పీడ్ పెంచిన కేరళ కుట్టి.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన అనుపమ ?..

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. కార్తికేయ 2 చిత్రంతో మరోసారి అనుపమ క్రేజ్ మారిపోయింది.

Anupama Parameswaran: స్పీడ్ పెంచిన కేరళ కుట్టి.. బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన అనుపమ ?..
Anupama
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 8:55 AM

అందం, అభినయం కలగలసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran). ప్రేమమ్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల మనసులను దొచుకుంది ఈ కేరళ కుట్టి. ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది.. అఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అచ్చమైన తెనుగింటి ఆడపిల్లగా కనిపించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‏లోనే కాకుండా మలయాళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ క్రేజ్‏తో దూసుకుపోతుంది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక తాజాగా కార్తికేయ 2 సినిమాతో మరోసారి టాలీవుడ్ వెండితెరపై అలరించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. కార్తికేయ 2 చిత్రంతో మరోసారి అనుపమ క్రేజ్ మారిపోయింది.

తాజాగా ఈ కేరళ కుట్టి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ భారీ సినిమాతో హిందీలో లాంఛ్ చేసేందుకు ఆమెను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటెంట్ నచ్చడంతో అనుపమ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం దక్షిణాది వరుస ఆఫర్లు అందుకుంటున్న అనుపమ.. బీటౌన్ ఎంట్రీ ఇస్తుందా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం ప్రేమమ్ హీరోయిన్ ప్రధాన పాత్రలో బట్టర్ ఫ్లై చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.