Viral Photo: ఈ బూరబుగ్గల పాపాయిని గుర్తుపట్టారా..? మన తెలుగమ్మాయే
గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన త్రోబ్యాక్ ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట సర్కులేట్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఈ క్యూటీ ఎవరో కనిపెట్టగలరా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. స్టార్స్ చిన్నప్పటి ఫోటోలను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. తను మన తెలుగమ్మాయే అండోయ్. నాన్న పక్కన అమాయకంగా కూర్చున్న ఈ క్యూటీ ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పించింది. ఇంతకూ తనెవరో గుర్తుపట్టారా..? ఇక మేమే చెప్పేస్తాం.
తనెవరో కాదు మన అంజలి. ఆంధ్రాలో జన్మించిన అంజలి.. ముందుగా జీవా నటించిన డేర్ సినిమాలో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత షాపింగ్ మాల్ సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకుంది. ఈ మూవీలో సంధ్య పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ జర్నీ చిత్రంలో ఆమెకు చాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సైతం మంచి హిట్ అయ్యింది. దీంతో తెలుగులో కూడా అంజలికి చాలా ఆఫర్స్ వచ్చాయి. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా.. అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అమాయకంగా కనిపిస్తూ.. కల్లాకపటం తెలియని అమ్మాయిగా అంజలి నటనకు తెలుగు ప్రేక్షకులు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ప్రస్తుతం తెలుగులో గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాల్లో నటిస్తుంది అంజలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
