పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా సోమవారం (డిసెంబర్ 02) హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల, దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పుష్ప 2 భారీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుష్ప 2 సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం. పుష్ప విషయానికి వస్తే ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా ఉంది. పుష్పలో ఈ క్యారెక్టర్ నేను అడిగి తీసుకున్నాను. దానికి అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేను డిసెంబర్ 5వ కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను. సుకుమార్ గారి చిత్రాలు అంటే కచ్చితంగా మన అంచనాలకు మించి ఉంటాయి.
‘నాకు సినిమాలో అల్లు అర్జున్ గారితో తక్కువ సీన్లు ఉన్నా కూడా ఎక్కువగా సునీల్ గారితో, ఫాహద్ ఫాసిల్ గారితో ఎక్కువగా ఉన్నాయి. వారి దగ్గరను నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాలు రష్మిక ఈ సినిమా కోసం ఎంత కష్ట పడిందో చూశాను. ఖచ్చితంగా దీనికి తగ్గ ఫలితం నీకు దక్కుతుంది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లో కలుద్దాం’ అని అన్నారు.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.