Tollywood: ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా.. ఇప్పుడు ఫారెన్ మోడల్‌లా

గుర్తుపట్టారా ఈ బ్యూటీని.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు దక్కించుకుంటుంది. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో అందాలతో తను చేసే రచ్చ నెక్ట్స్ లెవల్. క్లూ ఏంటంటే..? తను తెలుగమ్మాయ్.. ఏమైనా ఐడియా వచ్చిందా...?

Tollywood: ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా.. ఇప్పుడు ఫారెన్ మోడల్‌లా
heroine crazy look
Follow us

|

Updated on: May 16, 2024 | 5:52 PM

నటిగా రాణించాలంటే ఫలానా పాత్రలు మాత్రమే చేస్తానని మడి కట్టుకుని కూర్చుంటే సరిపోదు. అభినయం ఉన్న పాత్రలూ ఎంచుకోవాలి.. ఇటు అందాల ఆరబోతకు సిద్దంగా ఉండాలి. మృణాల్ ఠాకూర్‌ని చూడండి.. సీతారామం సినిమాలో ఎలా ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందో. ఇలాంటి ట్రెండ్‌ని ఎప్పటినుంచో ఫాలో అవుతోంది ఓ నటి. పైగా తను బయట అమ్మాయి కాదు.. పదహారణాల తెలుగు పిల్ల.  సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. కుర్రాళ్ల అయితే ఈ పాపకి ఎంకరేజ్ చెయ్యండి అంటూ మేకర్స్‌కు తెగ రిక్వెస్టులు పెడుతున్నారు. పైన ఫోటో చూశారు కదా.. తనెవరో గుర్తుపట్టారా..? చాలామంది కుర్రాళ్లు అయితే ఈజీగానే చెప్పేస్తారు. సోషల్ మీడియాను యూజ్ చేయనివారికి మేమే చెప్పేస్తాం లెండి..

తను ఇంకెవరో కాదు.. నటి అనన్య నాగళ్ళ. తొలుత సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. మల్లేశం మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. అలా ప్లే బ్యాక్, వకీల్ సాబ్, తంత్ర వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పొట్టేల్ అనే సినిమాలో యాక్ట్ చేసింది. డైరెక్టర్ సాహితి మోత్కూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యువ చంద్ర హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది.

అనన్య గురించి మీకో విషయం చెప్పాలండోయ్. తను కేవలం నటి మాత్రమే కాదు మంచి రైటర్ కూడా అట. అవును.. ఆమె హీరోయిన్ గా వచ్చిన మల్లేశం సినిమా దర్శకుడు రాజ్ రాచకొండ హిందిలో 8 MM మెట్రో మూవీ చేశారు. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య జంటగా వచ్చిన ఈ మూవీ గతేడాది ఆడియెన్స్ ముందుకు వచింది. ఈ చిత్రం స్టార్టింగ్ టైటిల్స్‌లో స్పెషల్ థాంక్స్ టూ అనన్య నాగళ్ళ అని వేశారు డైరెక్టర్ రాజ్ రాచకొండ. ఎందుకంటే.. ఈ సినిమా స్టోరీ విషయంలో అనన్య హెల్ప్ చేసిందట. ఇదే విషయాన్ని అనన్యనే ఇటీవల స్వయంగా తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ