Aishwarya Lekshmi: లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై నమ్మకం లేదు.. హీరో ఉండాల్సిందే.. ఐశ్వర్య లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు..
సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మట్టీ కుస్తీ, అమ్ము సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి ఎక్కువగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మట్టీ కుస్తీ, అమ్ము సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి ఎక్కువగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఇందులో ఐశ్వర్య లక్ష్మి నటనపై ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ.. ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఈ హీరోయిన్ మాట్లాడుతూ.. లేడీ ఒరియెంటెడ్ సినిమాలపై తనకు నమ్మకం లేదని తెలిపింది.
కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉండే సినిమాలపై మీ అభిప్రాయమేంటని అడగ్గా.. “మహిళలు మాత్రమే ప్రధాన పాత్రలు పోషించే కథలను నేను నమ్మను. ఎందుకంటే జీవితంలో స్త్రీలు, పురుషులు అందరూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. ప్రస్తుతం నా దృష్టిలో సినిమా అంటే బ్యాలెన్స్‌గా ఉండాలి. స్త్రీ, పురుష పాత్రలు రాసుకున్నా.. అవి లేకుంటే ప్రయోజనం లేదు.. ఎందుకంటే సినిమా అంటే సమాజానికి, మన జీవితాలకు ప్రతిబింబం కావాలి.. మన జీవితాల్లో కూడా బుల్లితెరపై సమతూకం ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది.




ఎంబీబీఎస్ పూర్తిచేసి.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. తన తల్లిదండ్రులు సమాజం గౌరవించే వృత్తిలో తాను ఉండాలని కోరుకుంటున్నారని.. కానీ ఇండస్ట్రీలోకి రావడం వారికి నచ్చలేదని తెలిపింది. “నాన్న సెక్రటేరియట్‌లో, అమ్మ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒక్కగానొక్క కూతురు కోసం సినిమా అంటే అస్సలు ఆలోచించలే. సినిమాల్లోకి వస్తానంటే వారిద్దరు ఒప్పుకోలేదు. సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదు. ప్రతి రోజూ పోరాటమే. నేను చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులకు నచ్చేలా చూసుకోవాలి. హీరోయిన్ విషయానికొస్తే, మనకు షెల్ఫ్ లైఫ్ ఉందని మేము ఎప్పుడూ చెబుతాము.” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
