Gollapudi Maruthi Rao wife dead: గొల్లపూడి మారుతీరావు భార్య మృతి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసిన శివకామసుందరి
Gollapudi Maruthi Rao wife dead : దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(Goallapudi Maruti rao) భార్య శివకామసుందరి (81)(Shivakasundari) శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని టి.నగర్‌లోని..
Gollapudi Maruthi Rao wife dead : దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(Goallapudi Maruti rao) భార్య శివకామసుందరి (81)(Shivakasundari) శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న తన స్వగృహంలో శివకామసుందరి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలను నిర్వహించారు. హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది.
రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా 2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటినుంచి శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతలుకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఒక కుమారుడు వైజాగ్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
Also Read: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా