AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: ‘అర్జున్‏తో వివాదం.. డబ్బులు చెల్లించారా ?’.. రిపోర్టర్ ప్రశ్నకు విశ్వక్ సేన్ రియాక్షన్ ఏంటంటే..

అర్జున్ సర్జాతో నెలకొన్న వివాదం పై స్పందించమని విలేకరి కోరగా.. ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. ఆ విషయం గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని సమాధానమిచ్చారు.

Vishwak Sen: 'అర్జున్‏తో వివాదం.. డబ్బులు చెల్లించారా ?'.. రిపోర్టర్ ప్రశ్నకు విశ్వక్ సేన్ రియాక్షన్ ఏంటంటే..
Vishwak Sen
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2023 | 9:26 PM

Share

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం దాస్ కా ధమ్కీ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రప్రమోషన్స్ వేగంగా జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఓ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ వివాదం గురించి ప్రశ్న ఎదురైంది. అర్జున్ సర్జాతో నెలకొన్న వివాదం పై స్పందించమని విలేకరి కోరగా.. ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. ఆ విషయం గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని సమాధానమిచ్చారు.

అర్జున్ సర్జాతో కాంట్రవర్సీ తర్వాత మీరు పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బులు చెల్లించారని విన్నాను. ఆ విషయంలో మీరెంతో బాధపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది ఎంతవరకూ నిజం ?.. అని విలేకరి ప్రశ్నించగా.. బదులిచ్చేందుకు విశ్వక్ ఆసక్తి చూపించలేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయానికి.. ఈసినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు అంటూ సమాధానమిచ్చారు.

అలాగే ధమ్కీ సినిమాకు దర్శకుడిని మార్చడం పై కూడా విశ్వక్ స్పందించారు. డైరెక్టర్ నరేష్ కొప్పిలి తాను కలిసి పాగల్ సినిమా చేశామని.. ఆ తర్వాత దాస్ కా ధమ్కీ అనుకున్నప్పుడు ఈ సినిమాకు అతడైతే సరిగ్గా న్యాయం చేయగలడనుకున్నాను. అందుకే ఈ సినిమాకు ముందుగా ఆయనను దర్శకుడిగా అనుకున్నాం. కానీ కథ గురించి చర్చించుకున్నప్పుడు.. అతడి ఆలోచన విధానానికి.. నేను అనుకున్న స్టోరీకి పొంతన కుదరలేదు. దీంతో నేనే దర్శకుడిగా మారాను. మా మధ్య ఎలాంటి గొడవలు.. వాదనలు జరగలేదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి