AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సునీల్ నో చెప్పాడు.. అతను ఓకే చేశాడు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్.. స్టార్ హీరో క్రేజ్

సునీల్ కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. టాప్ కమెడియన్స్ లో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు. అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

సునీల్ నో చెప్పాడు.. అతను ఓకే చేశాడు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్.. స్టార్ హీరో క్రేజ్
Sunil
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2025 | 11:42 AM

Share

టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ అంటే ముందు వరసలో ఉండే పేర్లలో సునీల్ పేరు ఒకటి. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్.. ఆతర్వాత హీరోగా మారిపోయాడు. అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా మారాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాదరామన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటివరకు కమెడియన్ గా ఉన్న సునీల్.. ఆతర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేశాడు. పెళ్లి కొడుకు, పులా రంగడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అయితే సునీల్ హీరోగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. సునీల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో సునీల్ ఇప్పుడు సహాయక పాత్రలు, విలన్.. కామెడీ పాత్రలు చేస్తున్నాడు.

వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్

అయితే ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సునీల్ నో చెప్పాడట.. సునీల్ నో చెప్పడంతో ఆ సినిమా హీరో నాని దగ్గరకు వెళ్లిందట.. ఆ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో భలే భలే మగాడివోయ్ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కథను ముందు సునీల్ కు వినిపించాడట మారుతి.

ఇవి కూడా చదవండి

సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే మారుతి ఈ సినిమా కథను ముందు సునీల్ కు చెప్పాడట.. హీరోకు మతిమరుపు అనే కాన్సెప్ట్ సునీల్ కు బాగా నచ్చిందట.. అయితే సినిమా పూర్తిగా కామెడీతో నిండిపోయింది.. కొన్ని యాక్షన్ సీన్స్, మాస్ సీన్స్ యాడ్ చేయమని చెప్పాడట.. అందుకు మారుతి ఒప్పుకోలేదట.. దాంతో ఆ కథను నానికి వినిపించి సినిమా చేశాడట మారుతి. ఈ విషయాన్ని గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు మారుతి. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాని కెరీర్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం నాని ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు.. అలాగే మరో సినిమాను కూడా లైనప్ చేశాడు.

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..