AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth- Raashi: ఎన్నాళ్లైంది ఆ ఇద్దరిని కలిసి చూసి.. రాశి, శ్రీకాంత్ చిలిపి అల్లరి చూశారా ?..

అమ్మో ! ఒకటో తారీఖు.. ప్రేయసి రావే, దీవించండి, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాశి పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత రాశి బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాశి. మరోవైపు చేతి నిండా సినిమాలతో శ్రీకాంత్ బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత వీరిద్దరు జంటగా ఒకే వేదికపై కనిపించారు.

Srikanth- Raashi: ఎన్నాళ్లైంది ఆ ఇద్దరిని కలిసి చూసి.. రాశి, శ్రీకాంత్ చిలిపి అల్లరి చూశారా ?..
Srikanth, Raasi
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2023 | 8:01 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ జోడిలలో శ్రీకాంత్, రాశి జంట ఒకటి. వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించి అలరించారు. ఈ జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అమ్మో ! ఒకటో తారీఖు.. ప్రేయసి రావే, దీవించండి, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రాశి పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత రాశి బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాశి. మరోవైపు చేతి నిండా సినిమాలతో శ్రీకాంత్ బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత వీరిద్దరు జంటగా ఒకే వేదికపై కనిపించారు. దీంతో వీరిని ఇలా కలిసి ఒకే స్టేజ్ పై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాశి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇద్దరు స్టేజ్ పై పక్క పక్కనే నిలబడి ఉన్నారు. కాసేపటి శ్రీకాంత్, రాశి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ నవ్వుతుండగా.. రాశి సరదాగా ఆయనను కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అప్పటి సూపర్ హిట్ జోడిని ఒకే స్టేజ్ పై చూసి వీడియో తెగ షేర్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి మరోసారి తెరమీద కనిపిస్తే బాగుంటుందని.. ఇద్దరు పాత స్నేహితులు కలిస్తే ఇలాగే ఆనందంగా ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీకాంత్ విలన్ గా.. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలోనూ కీలకపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు రాశి సైతం మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు జానకి కలగలేదు సీరియల్ తో అలరించిన రాశికి సినిమాల ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..