AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది.. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు

కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలై నెల గడిచిన థియేటర్లలో

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది.. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు
Untitled 1
Rajitha Chanti
|

Updated on: May 19, 2022 | 3:46 PM

Share

కొన్ని ప్రాంతీయ చిత్రాలను పాన్ ఇండియా సినిమాలు అని పిలవడం చాలా ఫన్నీగా ఉందన్నారు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో )(Prashanth neel) వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. విడుదలై నెల గడిచిన థియేటర్లలో కేజీఎఫ్ 2 హావా మాత్రం తగ్గడం లేదు.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించి అద్భుతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాపై స్పందించారు హీరో సిద్ధార్త్. తన తదుపరి చిత్రం ఎస్కేప్ లైవ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ కేజీఎఫ్ 2 సినిమా భారతీయ సినిమా అని పిలవాలంటూ చెప్పుకొచ్చారు.

కరోనా మహామ్మారి కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడిన కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలైన బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యథిక వసూళ్లు సాధించి రూ. 1000 కోట్ల క్లబ్‏లో చేరింది. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉందని.. అలా పిలుస్తున్నప్పుడు అగౌరవంగా అనిపిస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…

ఇవి కూడా చదవండి

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ” నాకు చాలా ఫన్నీగా అనిపిస్తోంది.. నేను 15 సంవత్సరాలకుపైగా పలు భాషల్లో పనిచేస్తున్నాను.. నా గొంతుతోనే ఇప్పటివరకు మాట్లాడాను.. నాకు ఎవరు డబ్బింగ్ చెప్పలేదు.. తమిళంలో తమిళుడిగా.. తెలుగులో అచ్చమైన తెలుగు కుర్రాడిగా.. హిందీలో భగత్ సింగ్ లా కూడా మాట్లాడుతాను. అందుకే నాకు పాన్ ఇండియా అనే అగౌవరంగా అనిపిస్తుంది..అందుకు బదులుగా భారతీయ సినిమా అని పిలవాలని కోరుకుంటున్నానను.. ఈ మాటలు ఎవరినో ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. హిందీ చిత్రాలకు ప్రాధాన్యతను ఇస్తారు.. అవి సూపర్ హిట్ అయితే బాలీవుడ్ సినిమా అని మాత్రమే అంటారు.. కానీ ప్రాంతీయ చిత్రాలు ప్రేక్షకులను ఆదరించినప్పటికీ వాటిని ఎందుకు పాన్ ఇండియా చిత్రాలు అంటున్నారు.. భారతీయ సినిమా అనొచ్చు కదా.. కేజీఎఫ్ సినిమా ప్రయాణాన్ని గౌరవించండి.. ఆ చిత్రాన్ని కన్నడ సినిమా అని పిలవండి. ఆ సినిమాను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను దృష్టిలో ఉంచుకునైనా దాన్ని ఇండియన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అందుకే పాన్ ఇండియా కాదు.. భారతీయ సినిమా అనండి.. పాన్ అనే పదం నాకు అర్థం కావడం లేదు.. తమాషాగా అనిపిస్తుంది. ” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్