AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌..

Anil Ravipudi: డైలాగ్‌ రైటర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఇండస్ట్రీలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడీ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే అందరి దృష్టి పడుతోంది. రాజా ది గ్రేట్‌తో మొదలైన అనిల్‌ విజయ ప్రస్తానం..

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌..
Anil Ravipudi
Narender Vaitla
|

Updated on: May 19, 2022 | 12:23 PM

Share

Anil Ravipudi: డైలాగ్‌ రైటర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఇండస్ట్రీలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడీ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే అందరి దృష్టి పడుతోంది. రాజా ది గ్రేట్‌తో మొదలైన అనిల్‌ విజయ ప్రస్తానం.. ఎఫ్‌2, సరిలేరు నీకెవ్వరు వరకు కొనసాగింది. సరిలేరు నీకెవ్వరుతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్‌ పేరు టాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగింది. ఇక ప్రస్తుతం ఎఫ్‌3తో మరో హిట్‌ను కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఫుల్‌ లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ను వేగం పెంచేసింది.

ఇదిలా ఉంటే అనిల్‌ ఎఫ్‌3 తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనిల్‌ ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమా చేయనున్నాడనే వార్త అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. అవన్నీ కేవలం వార్తలేనని వాటిలో నిజం లేదని చెప్పారు. ఎన్టీఆర్‌తో సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఏది ఫైనలైజ్ కాలేదని తెలిపిన అనిల్‌.. బాలకృష్ణతో మాత్రం సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అనిల్‌ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం తన దృష్టి మొత్తం ‘ఎఫ్‌3’ సినిమా ఫలితంపైనే ఉందని తెలిపిన అనిల్‌.. ఆ తర్వాత బాలకృష్ణ సినిమాపై ఫోకస్‌ చేస్తానన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమా గురించి ఆలోచించడలేదని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే 2019లో వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌లు హీరోలుగా వచ్చిన ఎఫ్‌2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌3 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈసారి సినిమాలో కామెడీ డోస్‌ను మరింత పెంచేందుకు దర్శకుడు.. సునీల్‌తో పాటు అలీని కూడా రంగంలోకి దింపుతున్నారు. మరి ఎఫ్‌3 ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం