AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevitha Rajasekhar: ‘నా కూతురు గురించి తప్పుడు రాతలు రాశారు..’ జీవిత ఎమోషనల్

మేం ఆస్తులమ్ముకుని సగం ఖర్చుపెట్టి గరుడవేగ సినిమా పూర్తి చేస్తే... ఆఖరికి తమనే దోషులుగా చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు జీవిత. విషయం కోర్టులో వున్నప్పుడు మీడియా ముందుకొచ్చి రచ్చ చేయడం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు

Jeevitha Rajasekhar: 'నా కూతురు గురించి తప్పుడు రాతలు రాశారు..' జీవిత ఎమోషనల్
Jeevitha Rajasekhar
Ram Naramaneni
|

Updated on: May 19, 2022 | 1:24 PM

Share

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో న్యూస్‌ మేకర్‌గా ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి జీవితా రాజశేఖర్. గతంలో మూవీ ఆర్టిస్టుల సంఘం(MAA) ఎన్నికల టైమ్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. లేటెస్ట్‌గా… ఫర్ మెనీ రీజన్స్‌… జీవిత పేరు అన్ని మీడియాల్లోనూ అదే రేంజ్‌లో సౌండ్ ఇస్తోంది. అరె… నా చుట్టూ ఇన్ని కాంట్రవర్సీలున్నాయా అంటూ ఆమే షాకవుతున్నారిప్పుడు. ఇవాళ ఫిలిమ్ ఛాంబర్లో(Telugu Film Chamber) జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్టాడారు జీవిత. అన్ని ఇష్యూస్‌నీ రీకాల్ చేసుకుని, అన్నిటి మీదా క్లారిటీ ఇచ్చారు. ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తాను కామెంట్‌ చేశానన్న వార్తలపై కూడా వివరణ ఇచ్చారు జీవితా రాజశేఖర్. ఆర్యవైశ్యుల గురించి తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. కోమటి వాళ్ల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే తానా సామెత వాడానని చెప్పారు. ఎవరైనా బాధపడితే సారీ… అంటూ కాస్త తగ్గారు జీవితా రాజశేఖర్. సినీ పరిశ్రమ వర్గాల్ని పర్మిషన్ అడిగి మరీ ఇలా మీడియా ముందుకొచ్చా అన్నారు. తన మీదొచ్చిన ఎలిగేషన్లు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరి మీదా రాలేదని వాపోతున్నారు జీవిత. 26 కోట్లు మోసం చేశామని తమను రచ్చకీడ్చిన గరుడవేగ సినిమా ప్రొడ్యూసర్లను ప్రస్తావించారు. మేం ఆస్తులమ్ముకుని సగం ఖర్చుపెట్టి సినిమా పూర్తి చేస్తే… ఆఖరికి తమనే దోషులుగా చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. విషయం కోర్టులో వున్నప్పుడు మీడియా ముందుకొచ్చి రచ్చ చేయడం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు జీవిత. తమ ఫ్యామిలీ మీద సోషల్ మీడియా కత్తి కట్టిందన్నది కూడా ఆమె చేస్తున్న అభియోగం. తన కూతురు ఎవరితోనో లేచిపోయారని రాసిన వార్తల్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.

‘సినిమా పరిశ్రమ చాలా సెన్సిటివ్. సినిమా సెలబ్రిటీల జీవితాలైతే అంత కంటే సున్నితం… తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి… అంతే తప్ప ఇలా గుచ్చిగుచ్చి బాధకు గురిచెయ్యకండి…’ అంటున్నారు జీవిత. రాజశేఖర్ హీరోగా చేస్తున్న శేఖర్ మూవీ రేపే రిలీజౌతోంది. చాలా గ్యాప్ తర్వాత భర్తను డైరెక్ట్ చేస్తూ, సొంత బేనర్‌పై ప్రిస్టీజియస్‌గా జీవిత నిర్మిస్తున్న సినిమా ఇది. సొంత సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఆమె ఇలా గొడవల్ని వెల్‌కమ్ చేస్తున్నారా… లేక సహజంగానే జీవితా రాజశేఖర్ ఫ్యామిలీ తరచూ కార్నర్ అవుతున్నారా… అనేది సినీ పరిశ్రమలోను, ఆడియన్స్‌లోనూ అంతుబట్టని ప్రశ్న.