Siddharth: చికిత్స అనంతరం ఇండియాకు తిరిగివచ్చిన సిద్ధార్థ్.. కోలుకుంటున్నానని ప్రకటన
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు హీరో సిద్ధార్థ్. బాయ్స్ సినిమాతో ఆకట్టుకున్న సిద్ధార్థ్.. ఆతర్వాత వరుసగా తెలుగు తమిళ్‌లో సినిమాలు చేస్తూ వచ్చాడు.. తెలుగులో బొమ్మరిల్లు
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు హీరో సిద్ధార్థ్. బాయ్స్ సినిమాతో ఆకట్టుకున్న సిద్ధార్థ్.. ఆతర్వాత వరుసగా తెలుగు తమిళ్‌లో సినిమాలు చేస్తూ వచ్చాడు.. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించినంత గా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఆయన తమిళ్ ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక ఇప్పుడు మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సిద్ధార్థ్. ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సందర్భంగా స్టంట్ సీక్వెన్స్ సమయంలో గాయపడ్డారు సిద్ధార్థ్. దాంతో ఆయన చికిత్స కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల జరిగిన మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా సిద్ధార్థ్ హాజరుకాలేక పోయాడు.
ఇదిలా తాజాగా ఆయన సర్జరీ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు.. సిద్ధార్థ్ లండన్ లోని ఆసుపత్రిలో చిన్న సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ సక్సెస్ అయిందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సర్జరీ పూర్తి అయ్యింది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ సందర్భంగా స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయం అయ్యిందని తెలిపాడు సిద్దు. ప్రస్తుతం హైదరాబాదులో ‘మహా సముద్రం’ సినిమాకు డబ్బింగ్ చెపుతున్నానని… అలాగే సినిమా రిలీజ్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇక డాక్టర్లు కొంతకాలం రెస్ట్ తీసుకోమని సూచించారని తెలిపాడు సిద్ధార్థ్. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రంలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నారు సిద్ధార్థ్ . ఈ సినిమా అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Chay-Sam: దాంపత్య జీవితానికే ఎండ్ కార్డు.. స్నేహ బంధానికి కాదు.. క్లారిటీ ఇచ్చేశారు
Kondapolam Pre- Release Event : ‘కొండపొలం’ పాటల పండగ.. కర్నూల్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత