Sayaji Shinde: నేను బాగానే ఉన్నాను.. త్వరలోనే మీ ముందుకు వస్తాను.. ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన నటుడు సాయాజీ షిండే..
సాయాజీకి పరీక్షలు నిర్వహించగా.. అతడికి నిర్వహించిన గుండె పరీక్షల్లో మూడు రక్తనాళాల్లో ఒకటి 99 శాతం బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడికి యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్రమైన ఛాతీ నొప్పితో ముంబైలని సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న గుండెలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. సాయాజీకి పరీక్షలు నిర్వహించగా.. అతడికి నిర్వహించిన గుండె పరీక్షల్లో మూడు రక్తనాళాల్లో ఒకటి 99 శాతం బ్లాక్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడికి యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు సాయాజీ షిండే. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే త్వరలోనే అభిమానులను అలరించేందుకు తిరిగి వస్తానంటూ చెప్పుకొచ్చాడు. “హాయ్.. నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే అభఇమానులందరూ నా శ్రేయోభిలాషులందరూ నాతో ఉన్నారు. ఇప్పుడు చింతించాల్సిన పనిలేదు. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు”అంటూ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం.
సాయాజీ షిండే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్ పురి, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు. తెలుగులో గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్ మెన్ వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




