Sarath Babu: నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేస్తున్న కుటుంబసభ్యులు
శరత్ బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసికొని ఎమోషనల్ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు.
శరత్ బాబు మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఆయన మృతి పై సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శరత్ బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసికొని ఎమోషనల్ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా… మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి… అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను.. శంకర్‌దాదా జిందాబాద్, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం… షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్ సాబ్ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది.
కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో… వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో .. శరత్‌బాబు ఆరోగ్యం పూర్తిగా విషమించి కన్నుమూశారు.
నేడు చెన్నైలో నటుడు శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు. హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరింది శరత్ బాబు భౌతిక ఖాయం. సుమారు 9.30 కు చెన్నైలోని టి నగర్ కు శరత్ బాబు భౌతిక ఖాయం చేరుకోనుంది. సాయంత్రం గిండి లో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.