Sarath Babu: ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 250కిపైగా సినిమాలు..
లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో... వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్ చేశారు.
ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు… తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో… వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో .. శరత్‌బాబు ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ప్రస్తుతం శరత్‌బాబు వయసు 72 ఏళ్ళు. చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్ అయ్యారు. సినిమాల్లోనే కాకుండా.. సీరియల్స్‌లోనూ నటిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ఆయన కొన్నాళ్లుగా సెప్సిస్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంచానికే పరిమితమయ్యారు.
1973 రామరాజ్యం సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్‌బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 250కిపైగా సినిమాల్లో నటించారు. చివరిగా వకీల్‌సాబ్ సినిమాలో కనిపించారు. సీనియర్ నటుడు తీవ్రఅనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది.