Radhe Shyam: ‘రాధేశ్యామ్’ లో ప్ర‌భాస్ కామెడీ నెక్ట్స్ లెవ‌ల్.. హింట్ ఇచ్చిన ఆ క‌మెడియన్

ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయి.. సినిమా అప్డేట్స్ ఇవ్వలేక కొందరు... ప్రమోషన్ చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని మరికొందరు.. సైలెన్స్ మోడ్ లోనే ఉండిపోయారు...

Radhe Shyam: 'రాధేశ్యామ్' లో ప్ర‌భాస్ కామెడీ నెక్ట్స్ లెవ‌ల్.. హింట్ ఇచ్చిన ఆ క‌మెడియన్
Radhe-Shyam
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 19, 2021 | 8:11 PM

ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయి.. సినిమా అప్డేట్స్ ఇవ్వలేక కొందరు… ప్రమోషన్ చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని మరికొందరు.. సైలెన్స్ మోడ్ లోనే ఉండిపోయారు. మరికొందరైతే.. దీనిక్కూడా ఒక మంచి సొల్యూషన్ కనిపెట్టారు. మా సినిమాను లైంలైట్ లో ఉంచే బాధ్యత మీది.. అంటూ కొందరు బ్రాండ్ అంబాసిడర్లను ముందుకు జరుపుతున్నారు. ఈ ట్రెండ్ లో ఇప్పుడు ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కూడా చేరిపోయిందా? అన్న అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి వయొలెన్స్ ఎక్కువైంది.. కాస్త రొమాన్స్ కావాలి అని అడిగి మరీ ఇప్పించుకున్న సాహా స్టార్ ప్రభాస్… ఇప్పుడు రొమాన్స్ కాదు.. నా మార్క్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ అని డిమాండ్ చేస్తున్నారు. అందుకే.. రాధేశ్యామ్ మూవీ… పేరుకు వింటేజ్ లవ్ స్టోరీ అయినా.. అందులో హ్యూమర్ పర్సెంటేజ్ ఎక్కువేనట. ఈ మేటర్ చెప్పింది హీరోనో డైరెక్టరో కాదు.. రాధేశ్యామ్ లో యాక్ట్ చేసిన యువనటుడు ప్రియదర్శి.

లవ్ ఎపిసోడ్స్ లో డార్లింగ్ కి అడ్డుపడే క్యారెక్టర్లో చేస్తున్నారట ప్రియదర్శి. ఇందులో ప్రభాస్ తన కంటే బెటర్ కామెడీ పండించారన్నది అతడిచ్చిన మేజర్ క్లూ. సో… మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల నాటి… నాటీ ప్రభాస్… రాధేశ్యామ్ లో రిపీట్ కాబోతున్నారన్న మాట. సినిమా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలీక, మినిమమ్ అప్డేట్స్ లేక వెయిటింగ్ లో వున్న డైహార్డ్ ఫ్యాన్స్ ని.. ఇప్పుడు ప్రియదర్శి ద్వారా కూల్ డౌన్ చేశారు మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో సినిమాకు హైప్ తీసుకురావడంలో.. ఇదొక లేటెస్ట్ టెక్నిక్ గా మారిపోయింది. పుష్ప మూవీలో హీరోకిచ్చే ఎలివేషన్ కేజీఎఫ్ కంటే టెన్ టైమ్స్ బెటర్ అని సుక్కూ శిష్యుడు బుచ్చిబాబు ఇచ్చిన ఒకేఒక్క స్టేట్మెంట్ నేషనల్ లెవల్లో పేలింది. అంతకుముందు ట్రిపులార్ మూవీ కంటెంట్ నుంచి స్ట్రాంగ్ లీక్స్ ఇచ్చి.. జక్కన్న మేకింగ్ స్టైల్ ని కొత్త హైట్స్ లో నిలబెట్టారు కథకుడు విజయేంద్ర ప్రసాద్. అదే స్టయిల్ లో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ బాధ్యతను టెంపరరీగా ప్రియదర్శి తీసుకున్నారా? అని చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు .

Also Read:  ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..

రైళ్లలో బిచ్చమెత్తుకునే ఓ హిజ్రా.. ఫోటో జర్నలిస్టుగా ఎదిగిన వైనం.. స్ఫూర్తివంతం

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు