Viral Video: ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..

సాధారణంగా ఎవరైనా కొబ్బరిబోండం తాగాలంటే కత్తి తీసుకుని దాని మొదలును కట్‌ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు. కానీ ఓ చిలుక మాత్రం డైరెక్ట్‌గా....

Viral Video: ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..
Parrot Drinking Coconut Water
Follow us

|

Updated on: Jun 19, 2021 | 5:03 PM

సాధారణంగా ఎవరైనా కొబ్బ‌రి బొండం తాగాలంటే కత్తి తీసుకుని దాని మొదలును కట్‌ చేసి ఆపై రంధ్రం చేసి కొబ్బరి నీళ్లు తాగుతారు. కానీ ఓ చిలుక మాత్రం డైరెక్ట్‌గా చెట్టుకు ఉన్న కొబ్బ‌రి బొండాన్ని తెంచి చాలా సింపుల్‌గా అందులోని నీళ్లని పీల్చేసింది. ఈ రంగుల చిలుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గుడిచర్ల గ్రామంలోని ఓ రైతు పొలంలోని కొబ్బరి చెట్టుపై ఈ వెరైటీ చిలుక చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే ఆ చిలుకకు దాహమైందో ఏమో తెలియదు కానీ… కొబ్బరి చెట్టుపై కూర్చొని ఓ కొబ్బరి బొండం తెంపి.. ఆపై దాని పొడవాటి ముక్కుతో  బొండం తొలిచేస్తూ.. చాలా సులువుగా  పైకెత్తి అందులోని నీటిని గుటగుటా తాగేసింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే నీలం, పసుపు రంగులు కలిగివున్న ఆ చిలుక చూడ్డానికి కాస్త వింతగా ఉంది. ఇదిలావుంటే ప్రస్తుతం మానవాళి జీవనంలో యాంత్రికంగా మార్పులు సంభవించడంతో అనేక జీవరాశులు వాటి మనుగడను కోల్పోతున్నాయి. ఒక‌ప్పుడు మ‌న వ‌ద్ద బాగా క‌నిపించిన చిలుక‌లు.. ఇప్పుడు అరుదుగా మాత్ర‌మే తార‌స‌ప‌డుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటువంటివి ఒకరకంగా మనసుకు చాలా ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ చిలుక విన్యాసాలను చూసిన నెటిజన్లు వీడియోను షేర్‌ చేస్తూ..లైక్‌లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం

కిలాడీ లేడీస్‌.. కాస్లీ చీరలే టార్గెట్‌.. దొంగ‌త‌నం చేసిన 24 గంట‌ల్లోనే క‌ట‌క‌టాల వెన‌క్కు..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!