Prashanth: 51 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి రెడీ అవుతోన్న నటుడు ప్రశాంత్.. వధువు ఎవరంటే?
ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ ప్రేమ శిఖరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి ముద్దు, ప్రేమ కావ్యం సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ప్రశాంత్. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమా ఈ హీరో క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది

కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ ఈ హ్యాండ్సమ్ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ ప్రేమ శిఖరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి ముద్దు, ప్రేమ కావ్యం సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ప్రశాంత్. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమా ఈ హీరో క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. మధ్యలో కేవలం తమిళ సినిమాలే చేసినా 2019లో రామ్ చరణ్ వినయ విధేయ రామ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చెర్రీ అన్నయ్యగా నటించి మన్ననలు అందుకున్నాడు. ప్రస్తుతం అంధగన్ అనే సినిమాలో నటించాడు ప్రశాంత్. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తన కుమారుడు మళ్లీ పెళ్లీ చేసుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం వధువును వెతుకుతున్నామని, త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతామన్నారు. తండ్రి మాటలకు స్టేజీపై ఉన్న ప్రశాంత్ సిగ్గుపడినట్లు కనిపించాడు.
కాగా 2005లో గృహలక్ష్మి అనే మహిళతో కలిసి ఏడడుగులు నడిచాడు ప్రశాంత్. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లైన నాలుగేళ్లకే అంటే 2009లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి సింగిల్‌గానే ఉంటున్నాడు ప్రశాంత్. పూర్తిగా ప్రొఫెషనల్ కెరీర్‌పైనే దృష్టి సారించాడు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ప్రస్తుతం అతని వయసు 51 ఏళ్లు.
అంధగన్ సక్సెస్ మీట్ లో ప్రశాంత్, త్యాగరాజన్.. వీడియో
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
కాగా హీరోగా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తున్నాడు ప్రశాంత్. అందులో భాగంగానే స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హీరో ప్రశాంత్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








