Actor Naresh: పవిత్ర జయరామ్, చంద్రకాంత్ మరణాలపై నరేష్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన పవిత్ర స్నేహితుడు నటుడు చంద్రకాంత్ కొద్దిరోజులకే సూసైడ్ చేసుకున్నాడు. వీరిద్దరి మరణం తర్వాత వీరి రిలేషన్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా పవిత్ర, చంద్రకాంత్ రిలేషన్ షిప్, మరణాలపై నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన పవిత్ర స్నేహితుడు నటుడు చంద్రకాంత్ కొద్దిరోజులకే సూసైడ్ చేసుకున్నాడు. వీరిద్దరి మరణం తర్వాత వీరి రిలేషన్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. చంద్రకాంత్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండడంతో.. త్రినయని సీరియల్ ద్వారా పవిత్రతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందంటూ అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి బంధంపై ఇరు కుటుంబసభ్యులు ఆసక్తిక కామెంట్స్ చేశారు. తాజాగా పవిత్ర, చంద్రకాంత్ రిలేషన్ షిప్, మరణాలపై నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు సర్వస్వం అనుకున్నవారు ఆకస్మాత్తుగా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుందని.. ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు పక్కన ఉండాలని అన్నారు.
నరేష్ మాట్లాడుతూ.. “ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పది మంది వచ్చి పైకి లేపేవాళ్లు ఉంటారు. మేమున్నామంటూ భరోసా ఇచ్చేవాళ్లు ఉంటారు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాం. అమ్మా నాన్న పిల్లలు. ఇదే కుటుంబం. ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది. ఎవరి ఆశయాలు వాళ్లవి. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు. సంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.
అసలేం కోల్పుతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరివారైపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. అమ్మ చనిపోయాక కృష్ణగారు.. నేను చాలా బాధపడ్డాం. ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం. ఉదయాన్నే పలకరించేవాడిని. మహేష్ కూడా వచ్చి చూసి వెళ్తాం అని ధైర్యం చెప్పేవాడు. పది మంది నాకున్నారన్న బలం వేరు. ఎవరైన మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కన ఉండాలి. ఈరోజుల్లో అది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వాలు లేక ఇలాంటివి జరుగుతున్నాయి.” అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.