Actor Nani: విజయ్, రష్మిక ఫోటో వివాదం స్పందించిన నాని.. క్షమాపణలు చెప్పిన న్యాచురల్ స్టార్..

తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమాకు అడియన్స్ ముందుకు తీసుకువస్తుండగా.. ఇందులో మరోసారి తండ్రిగా కనిపించనున్నారు నాని. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.. అయితే ఈ వేడుకలో అనుహ్యంగా విజయ్, రష్మిక మార్ఫింగ్ ఫోటో స్క్రీన్ పై కనిపించింది.

Actor Nani: విజయ్, రష్మిక ఫోటో వివాదం స్పందించిన నాని.. క్షమాపణలు చెప్పిన న్యాచురల్ స్టార్..
Nani, Vijay, Rashmika
Follow us

|

Updated on: Dec 03, 2023 | 11:19 AM

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటేస్ట్ సినిమా హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమాకు అడియన్స్ ముందుకు తీసుకువస్తుండగా.. ఇందులో మరోసారి తండ్రిగా కనిపించనున్నారు నాని. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.. అయితే ఈ వేడుకలో అనుహ్యంగా విజయ్, రష్మిక మార్ఫింగ్ ఫోటో స్క్రీన్ పై కనిపించింది. మాల్దీవ్స్ లో విజయ్ ఫోటోను.. అలాగే రష్మిక ఫోటోను ఒకేచోట ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఫోటో స్క్రీన్ పై రావడంతో నాని, మృణాల్ తోపాటు.. అక్కడున్నవారంతా షాకయ్యారు.

అయితే ఈ పొరపాటును యాంకర్ సుమ కవర్ చేసే ప్రయత్నం చేశారు. సెలబ్రెటీల పర్సనల్ ఫోటోస్ బయటకు తీస్తావా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతూనే కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఫోటో వివాదం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. నాని ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడించింది. తాజాగా ఈ వివాదం పై స్పందించారు నాని. రష్మిక, విజయ్ ఇద్దరికి క్షమాపణలు చెప్పాడు.

అది అసలు తెలియకుండా జరిగిందని.. ఆకస్మాత్తుగా అలా చూసేసరికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. ఓ ఈవెంట్ కోసం చాలా మంది పనిచేస్తుంటారని.. అందులో అది ఎవరు ప్లాన్ చేశారని.. అసలు ఎందుకు వేశారనేది తెలియలేదని అన్నాడు. అలా సడెన్ గా చూసి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియలేదని.. విజయ్, రష్మిక ఇద్దరూ నా ఫ్రెండ్స్ అని.. వాళ్ల గురించి అలా పబ్లిక్ గా ఎందుకు వేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఆ ఘటన కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నాను… అసలు అది జరిగి ఉండకూడదు .. ఈవెంట్లో ఎవరో చేశారో తెలియదు.. ఇప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం పోతుందని భయపడుతూ ఉండొచ్చు అని చెప్పుకొచ్చాడు నాని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?