- Telugu News Photo Gallery Cinema photos Audiences say that if they are responsible towards the society, our liking for the released star movies will increase a lot
Film News: సొసైటీ పట్ల వాళ్లు బాధ్యతగా ఉంటే.. మేము కూడా సినిమాలపై అభిమానం పెంచుకుంటాం అంటున్న ఆడియన్స్..
చాలా మంది షూటింగులకు సెలవు పెట్టి, పర్మిషన్ పెట్టి మరీ ఓట్లేశారు. సొసైటీ పట్ల వాళ్లు బాధ్యతగా ఉంటే, రిలీజ్ అయ్యే స్టార్ సినిమాల మీద మాకు ఇష్టం మహా ఇదిగా పెరిగిపోతుందని అంటున్నారు ఆడియన్స్. ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాల కోసం రెడీ అంటున్నారు. వయొలెన్స్ కా బాప్ అంటూ యానిమల్ సినిమా గురించి సీరియస్‌గా రంగంలోకి దిగి మరీ ప్రచారం చేశారు సందీప్‌రెడ్డి వంగా. బుల్లితెరమీద సందడి చేసేవారు , సిల్వర్ స్క్రీన్ మీద అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 03, 2023 | 11:44 AM

చాలా మంది షూటింగులకు సెలవు పెట్టి, పర్మిషన్ పెట్టి మరీ ఓట్లేశారు. సొసైటీ పట్ల వాళ్లు బాధ్యతగా ఉంటే, రిలీజ్ అయ్యే స్టార్ సినిమాల మీద మాకు ఇష్టం మహా ఇదిగా పెరిగిపోతుందని అంటున్నారు ఆడియన్స్. ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాల కోసం రెడీ అంటున్నారు.

వయొలెన్స్ కా బాప్ అంటూ యానిమల్ సినిమా గురించి సీరియస్‌గా రంగంలోకి దిగి మరీ ప్రచారం చేశారు సందీప్‌రెడ్డి వంగా. రీసెంట్ టైమ్స్ లో ఏ ఫిల్మ్ మేకర్ చేయనటువంటి అటెంప్ట్ యానిమల్ డ్యూరేషన్ విషయంలో చేస్తున్నారు సందీప్. రణ్‌బీర్, రష్మికి జంటగా నటించిన ఈ సినిమా మీద నార్త్, సౌత్ అనే తేడా లేకుండా హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ఏమాత్రం స్పార్క్ ఉన్నా వెయ్యి కోట్ల మార్కును టచ్ చేసే మూవీ అవుతుందనే మాట వినిపిస్తోంది ట్రేడ్ పండిట్స్ నుంచి.

క్లూస్ డిపార్ట్ మెంట్‌లో ఉండే యంగ్‌స్టర్స్ ఎలా ఉంటారు? పనిలో వాళ్ల క్యూరియాసిటీ ఎలా ఉంటుంది? క్రైమ్‌కి సంబంధించి క్లూస్ డిపార్ట్ మెంట్ ఎంత అలర్ట్ గా ఉండాలి వంటి అంశాలతో తెరకెక్కిన సినిమా అధర్వ. కార్తిక్ రాజు హీరోగా నటించిన ఈ సినిమా సక్సెస్ అయితే సెకండ్ పార్టు తీయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

బుల్లితెరమీద సందడి చేసేవారు , సిల్వర్ స్క్రీన్ మీద అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. సుడిగాలి సుధీర్ నటించిన లేటెస్ట్ సినిమా కాలింగ్ సహస్ర. ఈ థ్రిల్లర్‌ని శుక్రవారం విడుదల చేస్తున్నారు.






























