మరోసారి జోడీ కట్టనున్న అలనాటి సీనియర్ జంట… ‘సన్ ఆఫ్ ఇండియా’లో కీలక పాత్రలో నటించనున్న మీనా..

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహనా్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

  • Rajitha Chanti
  • Publish Date - 12:22 pm, Fri, 26 February 21
మరోసారి జోడీ కట్టనున్న అలనాటి సీనియర్ జంట... 'సన్ ఆఫ్ ఇండియా'లో కీలక పాత్రలో నటించనున్న మీనా..

Meena in Son Of India Movie:  టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహనా్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇలాంటి కంటెంట్ ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో రాలేదని చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటకు వినిపిస్తుతంది. ఇందులో మోహన్ బాబు సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటించనున్నట్లుగా సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా దృశ్యంలో తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తాజాగా మలయాళంలో తెరకెక్కిన దృశ్యం 2 సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్. గతంలో మోహన్ బాబు, మీనా కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే చాలా కాలం తర్వాత మళ్లీ మోహన్ బాబు, మీనా జంటగా రాబోతున్నారు. మీనా కోసం ఈ సినిమా పాత్రను అద్భుతంగా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన అల్లరిమొగుడు మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ తరహాలో ఉండబోతున్నట్లుగా టాక్. ఈ సినిమా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు భార్య విరానిక ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారట. అంతేకాకుండా ఈ స్క్రీన్ ప్లేలో మోహన్ బాబు కూడా పాలు పంచుకుంటున్నారట. మరీ చాలా కాలం తర్వాత మీనా, మోహన్ బాబు కలయికలో రాబోతున్న సినిమాపై ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా మోహన్ బాబు మంచి పాత్ర పోషించాడు.

Also Read:

నవ్వించే ఈ బుడ్డోడు.. తక్కువోడేం కాదు.. నైజీరియాలో పెద్ద తురుము.. ! మీమ్స్‌తో అదరగొడుతున్న ఒసిటా ఇహెమ్..

Drishyam 2 : ‘దృశ్యం 2’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు జీతు జోసెఫ్..