Mohan Babu: మంచు మనోజ్ పెళ్ళిపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన మోహన్ బాబు.. ఏమన్నారంటే..

|

Mar 22, 2023 | 8:40 AM

మనోజ్ పెళ్లి విషయంలో అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్లో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఒకానొక సమయంలో మనోజ్ వివాహనికి మోహన్ బాబు రావడం లేదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై ఘాటుగా స్పందించారు మోహన్ బాబు.

Mohan Babu: మంచు మనోజ్ పెళ్ళిపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన మోహన్ బాబు.. ఏమన్నారంటే..
Mohan Babu
Follow us on

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు భూమా మౌనికరెడ్డితో ఇటీవలే ఏడుడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి వివాహ కార్యక్రమాలన్నింటిని మంచు లక్ష్మి దగ్గరుండి చూసుకున్నారు. కుటుంబసభ్యులు.. స్నేహితులు.. బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే మనోజ్ పెళ్లి విషయంలో అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్లో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఒకానొక సమయంలో మనోజ్ వివాహనికి మోహన్ బాబు రావడం లేదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై ఘాటుగా స్పందించారు మోహన్ బాబు.

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహానికి మంచు మోహన్ బాబు రావడం లేదని వార్తలు షికార్లు కొట్టాయి. ఈ వార్తలను కొట్టిపారేస్తూ.. మనోజ్, మౌనిక పెళ్లిలో సందడి చేశారు మోహన్ బాబు. వధూవరులిద్దరిని ఆశీర్వాదించి భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైలాగ్ కింగ్ మాట్లాడుతూ.. “మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే చెప్పాడు. అయితే నేను ఓసారి ఆలోచించు అన్నాను. లేదు నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం సరైనదేనని అనుకుంటున్నాను అని అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ చేసుకో అన్నాను అంతే. ఇక ఎవడో ఏదో అనుకుంటాడు అని మనం చేసే పని ఆపకూడదు” అని అన్నారు.

ఏనుగు దారిపై వెళ్తుంటే.. దాని వెనకాల ఎన్నో కుక్కలు మొరుగుతాయని.. మనం ఎన్ని కుక్కలను ఆపుతాం.. మొరిగే కుక్కలను నువ్వు మొరగనివ్వు అని అన్నారు. అలాంటి వారిని పట్టించుకోకుండా నువ్వు నీ దారిలో వెళ్తే.. నువ్వు గొప్పోడివి అవుతావు అంటూ చెప్పుకొచ్చారు. భూమా ఫ్యామిలీతో తనకు చక్కని అనుబంధం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.