R Madhavan: మాధవన్ పై నెటిజన్ ప్రశంసలు.. అదిరిపోయే కౌంటరిచ్చిన హీరో.. దెబ్బకు ట్వీట్ డెలీట్..
మాధవన్ నటించిన రాకెట్రీ సినిమా అద్భుతంగా ఉందని.. చివరి సీన్ ఏదైతో ఉందో దాన్ని పదే పదే చూశాను. మీ తొలి దర్శకత్వం అద్భుతంగా ఉంది.
తమిళ్ స్టార్ హీరో మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటేస్ట్ చిత్రం రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మాధవన్. ఇందులో ఆయన నంబి నారాయణన్ పాత్రలో నటించగా.. కోలీవుడ్ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించారు. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాధవన్ నటనకు.. దర్శకత్వానికి సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్.. రాకెట్రీ సినిమా గురించి హీరో మాధవన్ ను పొగడ్తలతో ముంచేత్తాడు. రాకెట్రీ సినిమా అద్భుతమని.. దర్శకత్వం బాగుందంటూ ట్వీట్ చేశారు. అయితే హీరో మాధవన్ ఇచ్చిన కౌంటర్ కు దెబ్బకు ట్వీట్ డెలీట్ చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామా.
మాధవన్ నటించిన రాకెట్రీ సినిమా అద్భుతంగా ఉందని.. చివరి సీన్ ఏదైతో ఉందో దాన్ని పదే పదే చూశాను. మీ తొలి దర్శకత్వం అద్భుతంగా ఉంది. నటనకు కాస్త కూడా వంక పెట్టాల్సిన పనిలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా మాధవన్‌ను ట్యాగ్ చేసి ప్రశంసలు కురిపించారు. నెటిజన్ ట్వీట్ కు మాధవన్ బదులిస్తూ.. నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు ? అంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు నెటిజన్ ట్వీట్ వెంటనే డెలీట్ చేశాడు. కానీ అతని ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజానికి రాకెట్రీ సినిమా విడుదలై రెండు వారాలు మాత్రమే కావోస్తుంది. థియేటర్లలో వీక్షించే ప్రేక్షకుడు ఒక్క సీన్ ను అది తనకు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూడడం సాధ్యం కాదు. అంటే అతను పైరసీ ద్వారా సినిమా చూసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మాధవన్ సైతం గ్రహించి అతనికి కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది.
How did you re-watch it again and again? https://t.co/2DzO0IqtRY
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 8, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.