Actor Jayaram: మోడల్‌తో ప్రేమ.. సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు.. ఫోటోస్ వైరల్..
సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరామ్. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పటికీ దక్షిణాది చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా అలరిస్తున్నారు. తాజాగా జయరామ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

దక్షిణాది నటుడు జయరామ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు కాళిదాస్ వివాహం సింపుల్‌గా గుడిలో జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జయరామ్ అనేక చిత్రాల్లో నటించాడు. అతడి కొడుకు కాళిదాస్ తమిళంలో హీరోగా మెప్పిస్తున్నాడు. అయితే కాళిదాస్ కొన్నాళ్లుగా తరణి అనే మోడల్‌ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కేరళలోని గురవాయూర్ ఆలయంలో ఈరోజు (డిసెంబర్ 08న) ఉదయం వీరిద్దరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తెలుగులో అల వైకుంఠపురంలో. గుంటూరు కారం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జయరామ్. అతడి కొడుకు కాళిదాసు ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ధనుష్ నటించిన రాయన్ చిత్రంలో కాళిదాసు కీలకపాత్ర పోషించాడు. కాళిదాసు , తరణి నిశ్చితార్థం నవంబర్ లో జరిగింది. వీరిద్దరూ 2022 నుంచి ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కాళిదాస్ ఇంట్లో ఓనం వేడుకలో తరణి తన కుటుంబంతో కలిసి పాల్గొనగా వీరిద్దరి ప్రేమాయణం గురించి బయటకు వచ్చింది.
కాళిదాసు సతిమణి తరణి తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి చెందినది. 2019లో మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నరప్ టైటిల్స్ గెలుచుకుంది. తారిణి 2022లో మిస్ దావా యూనివర్స్ అందాల పోటీలో కూడా పాల్గొంది. 992లో గురువాయూర్ అంబలనాడలోనే జయరామ్, పార్వతి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు జయరామ్ కూతురు మాళవిక పెళ్లి కూడా గత నెలలో గురువాయూర్ లో జరిగింది. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ గురువాయూర్‌లోనే వివాహం జరగడం విశేషం.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




