Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నటి ఆమనికి మేకప్ వేస్తోన్న ఈ ప్రముఖ నటుడు ఎవరో గుర్తుపట్టారా..?

హిట్‌ పెయిర్‌- ఈ మాటకి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంటుంది. ఒక సినిమా బాగా హిట్ అయితే అందులోని హీరోహీరోయిన్స్‌ను మరోసారి కొనసాగించడానికి ఇష్టపడుతుంటారు మేకర్స్. ఆ జోడీ చుట్టూ ప్రత్యేకమైన మార్కెట్‌ లెక్కలు కూడా మొదలవుతుంటాయి. అలాంటి జోడీలు మళ్లీ మళ్లీ తెరపై దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు మీకు ఓ హిట్ పెయిర్ గురించి చెప్పబోతున్నాం...

Tollywood: నటి ఆమనికి మేకప్ వేస్తోన్న ఈ ప్రముఖ నటుడు ఎవరో గుర్తుపట్టారా..?
Aamani
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2025 | 8:10 PM

సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని జంటలకు కెమెస్ట్రీ భలే వర్క్ అవుతుంది.  ఆ జోడీలను మళ్లీ కలిసి నటిస్తే అభిమానుల్లో సినిమాపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా వారిని కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. చిరంజీవి – రాధ, వెంకటేష్ – సౌందర్య, వెంకటేష్ – మీనా,  శ్రీకాంత్ – రాశి, బాలకృష్ణ – విజయశాంతి, నాగార్జున – రమ్యకృష్ణ.. ఇక ఇప్పటి జనరేషన్‌లో ప్రభాస్-అనుష్క వంటివారు హిట్ పెయిర్స్ అని పేరు తెచ్చుకున్నారు. అలానే నటుడు జగపతిబాబు, నటి ఆమనిలది కూడా సూపర్ హిట్ పెయిర్. వారు కలిసి చేసిన  ‘శుభ లగ్నం’ ‘మావిచిగురు’ ‘తీర్పు’ లాంటి చిత్రాలు విజయవంతంగా నడిచాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సిల్వర్ స్క్రీన్ జంటకు బాగా కనెక్ట్ అయ్యారు.  ప్రస్తుతం వీరిద్దరూ క్యారక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో ‘పటేల్ సార్’ అనే సినిమాలో కలిసి నటించారు. తాజాగా మరోసారి ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నట్లు తాజా వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా సెట్స్‌లో తీసిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

తాజాగా జగపతిబాబు తన ఇన్ స్టాలో ఆమనితో ఉన్న ఓ వీడియో షేర్ చేసాడు. ఇందులో జగపతి బాబు ఆమని టచ్ అప్ బాయ్‌గా మారడం మీరు చూడవచ్చు. ఆమని దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చీలో కూర్చొని, మొబైల్ చూస్తుంటే.. జగపతిబాబు పక్కనే నిలబడి ఆమెకు గొడుగు పట్టి..  టచ్ అప్ చేస్తున్నాడు. ఆమని.. ”ముందు గొడుగు సరిగా పట్టు.., టచప్ సరిగా చెయ్యి.., ఏంటి.. ఇంత దగ్గరకు వస్తున్నావ్?” అంటూ జగపతిబాబును సరదగా ఆట పట్టించింది.

”పార్ట్-1: కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు” అంటూ జగపతిబాబు ఈ ఫన్నీ వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేశారు.  ‘శుభ లగ్నం’ సినిమాలో.. డబ్బుపై వ్యామోహంతో ఓ మధ్యతరగతి ఇల్లాలు తన మొగుడిని కోటి రూపాయలకు అమ్మేసే కాన్సెప్టు గుర్తుంది కదా. ఆ సన్నివేశాన్ని రిఫర్ చేస్తూ జగపతి బాబు ఆ క్యాప్షన్ పెట్టారు. త్వరలో పార్ట్ 2 వీడియో కూడా వచ్చే చాన్సుంది.

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌