AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 41 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న టాలీవుడ్ హీరో.. షూటింగ్ మధ్యలోనూ చదువుతూ…

సాధారణంగా ఓ వయసు దాటిన తర్వాత పుస్తకాలు పట్టుకోవాలంటే మనసెక్కదు. కానీ ఈ టాలీవుడ్ హీరో మాత్రం 41 ఏళ్ల వయసులోనూ శ్రద్ధగా చదువుకుంటున్నారు. షూటింగ్ మధ్యలో కాస్త టైమ్ దొరికినా డిగ్రీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. ఈ హీరో జూన్ లో పరీక్షలు రాయాల్సి ఉంది.

Tollywood: 41 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న టాలీవుడ్ హీరో.. షూటింగ్ మధ్యలోనూ చదువుతూ...
Tollywood Actor
Basha Shek
|

Updated on: May 16, 2025 | 2:35 PM

Share

సినిమా స్టార్ల విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏ స్టార్ హీరో/ హీరోయిన్ ఎంత వరకు చదువుకున్నాడు. ఏ సబ్జెక్టుల్లో డిగ్రీ పట్టాలు పొందారు? అన్న విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరో గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నటుడు 41 ఏళ్ల వయసులో పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. తాజాగా చదువులో మునిగిపోయి నోట్స్ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సదరు హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నటుడి డెడికేషన్ వేరే లెవెల్. ఒకవైపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు శ్రద్దగా చదువుకుంటోన్న ఈ నటుడి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇలా 41 ఏళ్ల వయసులోనూ చదువు కోసం కష్టపడుతోన్న ఈ హీరో మరెవరో కాదు హర్షవర్ధన్ రాణే. గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఇతను ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

హర్ష వర్ధన్ నటించిన సనమ్ మేరీ కసమ్ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో ఇదొక కొత్త రికార్డు. ఈ నటుడు గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించాడు. తకిట తకిట సినిమాతో హీరోగా పరిచయమైన హర్షవర్ధన్, ఆ తర్వాత నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, ‘ఫిదా’, బెంగాల్ టైగర్, అవును, అవును 2, అనామిక, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు.

నోట్స్ రాసుకుంటోన్న హర్ష వర్ధన్ రాణే.. వీడియో

ప్రస్తుతం హర్షవర్ధన్ తన రాబోయే రొమాంటిక్ చిత్రం ‘దీవానియాత్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇంతలో, జూన్‌లో తనకు సైకాలజీ ఆనర్స్ రెండవ సంవత్సరం పరీక్షలు ఉన్నాయని, దాని కోసం తాను కష్టపడి చదువుతున్నానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడీ హీరో. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ‘సినిమా షూటింగ్ జరుగుతోంది, సైకాలజీ ఆనర్స్ రెండవ సంవత్సరం పరీక్షలు జూన్‌లో ఉన్నాయి’ అని రాసుకొచ్చాడు. హీరో షేర్ చేసిన ఫోటోలలో, రాణే స్టడీ టేబుల్‌పై ఉంచిన నోట్స్ చదువుతూ కనిపించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హర్షవర్ధన్ ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చదువుతున్నాడు. దీని గురించి సమాచారాన్ని ఇంతకు ముందు తన అభిమానులతో పంచుకున్నాడు.

హర్ష వర్ధన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్